ముందు మమ్మల్ని దాటుకుని వెళ్లాలి: చరణ్ బర్త్‌డే వేడుకలో మెగా ప్రిన్స్

ABN , First Publish Date - 2022-03-29T01:33:16+05:30 IST

రామ్ చరణ్‌తో ఏదైనా మాట్లాడాలి అంటే.. ముందు మెగాభిమానులతో పాటు, తనని కూడా దాటుకుని వెళ్లాల్సి ఉంటుందని అన్నారు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు వేడుకలను ఆదివారం హైదరాబాద్ శిల్పకళా వేదికలో

ముందు మమ్మల్ని దాటుకుని వెళ్లాలి: చరణ్ బర్త్‌డే వేడుకలో మెగా ప్రిన్స్

రామ్ చరణ్‌తో ఏదైనా మాట్లాడాలి అంటే.. ముందు మెగాభిమానులతో పాటు, తనని కూడా దాటుకుని వెళ్లాల్సి ఉంటుందని అన్నారు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు వేడుకలను ఆదివారం హైదరాబాద్ శిల్పకళా వేదికలో మెగాభిమానులు భారీ ఎత్తున నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వరుణ్ తేజ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో..


‘‘మెగాభిమానులకు, విచ్చేసిన అతిథులకు ధన్యవాదాలు. చరణ్ అన్న పుట్టినరోజు అంటే మా అందరికీ ఒక చిన్న పండుగ లాంటిది, కానీ ఈసారి అది ఆర్ఆర్ఆర్ రూపంలో రెండు రోజులు ముందే వచ్చింది. ముందుగా ఇలాంటి అద్భుతమైన సినిమా తెరకెక్కించి.. అందులో అన్నయ్యకి సీతారామరాజు పాత్ర ఇచ్చిన రాజమౌళిగారికి, కొమురంభీం పాత్రలో నటించి అన్నయ్యతో అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్ ఇచ్చిన తారక్ గారికి ధన్యవాదాలు. 


అన్నయ్య విషయానికి వస్తే.. సాధారణంగా చిన్న వయసులో రామ్ చరణ్ అన్నయ్య అంటే నాకు భయం ఉండేది. ఎప్పుడూ ఆటపట్టిస్తూ ఉండేవాడు. ఎప్పుడైతే చిరుత సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడో.. అప్పటి నుంచి పూర్తిగా మారిపోయాడు. అప్పటి నుండి ఒక స్థాయి మెచ్యూరిటీ నేను చూశాను. పెదనాన్నగారిలోని మెచ్యూరిటీ, బాబాయిలో ఉన్న నిజాయితీ, ముక్కుసూటితనం కలగలిపి అన్నయ్యకి వచ్చాయి. చాలా చోట్ల మంచి నటులు ఉంటారు కానీ అన్నయ్యలో ఉన్న గొప్ప వ్యక్తిత్వం నేను ఇంకా ఎక్కడా చూడలేదు. అలాంటి అన్నకు తమ్ముడిని అవడం నిజంగా నా అదృష్టం. మా కుటుంబంలో ఎవరి పుట్టినరోజు ఉన్నా.. ఇలా ముందుకు వచ్చి ఒక పండుగలా చేస్తున్న అభిమానులందరికీ ధన్యవాదాలు. ఇది నా తరపున మాత్రమే కాదు.. చరణ్ అన్నయ్య తరపున కూడా చెబుతున్నాను. మీ ప్రేమ మామీద ఎప్పుడూ ఇలాగే కురిపిస్తారని కోరుకుంటున్నాను.


పుట్టిన రోజు అంటే మేము మీకు గిఫ్ట్ ఇవ్వాల్సి ఉంటుంది కానీ మీరు ఈసారి ఆర్ఆర్ఆర్ లాంటి అద్భుతమైన సినిమాతో గిఫ్ట్ ఇచ్చారు. సినిమా చూస్తున్నప్పుడు అన్నయ్య ఎక్కడా కనిపించలేదు.. కేవలం అల్లూరి సీతారామరాజుగారి పాత్ర మాత్రమే కనిపించింది. అంత చక్కగా సినిమాలో ఒదిగిపోయారు. కేవలం తెలుగు మాత్రమే కాదు ప్రపంచ స్థాయికి చరణ్ అన్న ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్నయ్య గురించి ఎవరైనా మాట్లాడాలి అంటే మీ అందరితో(మెగాభిమానులు) పాటు నేనూ అక్కడే ఉంటాను. ముందు మనతో మాట్లాడి ఆ తర్వాత చరణ్ అన్న దగ్గరకు వెళ్లాలి..’’ అంటూ వరుణ్ తేజ్ ఎమోషనల్ అయ్యారు.

Updated Date - 2022-03-29T01:33:16+05:30 IST