Balakrishna: బాలయ్య బర్త్ డేను ఆ రకంగా ఆ ఇద్దరూ...
ABN , Publish Date - Jun 11 , 2025 | 03:17 PM
నందమూరి బాలకృష్ణతో అత్యధిక చిత్రాలు తీసిన దర్శకుడు ఎ. కోదండరామిరెడ్డి, అలానే బాలకృష్ణతో వరుసగా నాలుగు బ్లాక్ బస్టర్స్ అందించిన దర్శకుడు బి. గోపాల్. వీరిద్దరూ కలిసి మంగళవారం బాలకృష్ణ బర్త్ డే సందర్భంగా కేక్ కట్ చేసి సందడి చేశారు.
జూన్ 10వ తేదీతో నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) 65 సంవత్సరాలు పూర్తి చేసుకుని 66వ సంవత్సరంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా చిత్రసీమలోని ప్రముఖులు, రాజకీయ నాయకులు, సామాజిక కార్యకర్తలు ఆయన్ని అభినందనలతో ముంచెత్తారు. విశేషం ఏమంటే... బాలకృష్ణ పరోక్షంలోనూ ఆయన బర్త్ డే వేడుకలు కొన్ని జరిగాయి. అలా మంగళవారం సాయంత్రం తమిళ డబ్బింగ్ సినిమా 'పా... పా' (Paa Paa) వేడుకలోనూ బాలకృష్ణ బర్త్ డే సందర్భంగా కేక్ కట్ చేసింది చిత్ర బృందం. విశేషం ఏమంటే ఈ కార్యక్రమానికి బాలకృష్ణతో అత్యధిక చిత్రాలను రూపొందించిన ప్రముఖ దర్శకులు ఎ. కోదండరామిరెడ్డి (A. Kodandarami Reddy), బాలకృష్ణతో వరుసగా నాలుగు బ్లాక్ బస్టర్ మూవీస్ ను తెరకెక్కించిన బి. గోపాల్ (B. Gopal) అతిథులుగా హాజరయ్యారు.
నందమూరి బాలకృష్ణ, ఎ. కోదండరామి రెడ్డి కాంబినేషన్ 'అనసూయమ్మ గారి అల్లుడు'తో మొదలైంది. ఆ తర్వాత 'భార్గవ రాముడు, భానుమతి గారి మొగుడు, తిరగబడ్డ తెలుగు బిడ్డ, రక్తాభిషేకం, భలేదొంగ, నారీ నారీ నడుమ మురారి, ధర్మక్షేత్రం, నిప్పురవ్వ, బొబ్బిలి సింహం, మాతో పెట్టుకోకు, ముద్దుల మొగుడు, యువరత్న రాణా' వరకూ సాగింది. అలానే బాలకృష్ణ, బి. గోపాల్ కాంబినేషన్ కు శ్రీకారం 'లారీ డ్రైవర్' తో మొదలైంది. ఆ తర్వాత వారిద్దరూ కలిసి చేసిన 'రౌడీ ఇన్ స్పెక్టర్' సైతం సూపర్ హిట్ అయ్యింది. ఇక వీరిద్దరి కాంబోలోనే వచ్చిన 'సమర సింహారెడ్డి (Samara Simha Reddy), నరసింహ నాయుడు' (Narasimha Naidu) చిత్రాలు బ్లాక్ బాస్టర్స్ గా నిలిచాయి. చివరగా వీరిద్దరూ చేసిన సినిమా 'పల్నాటి బ్రహ్మనాయుడు'. ఇది ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఆ తర్వాత కూడా బాలకృష్ణ, బి. గోపాల్ కాంబినేషన్ లో ఓ సినిమా మొదలైంది కానీ సెట్స్ పైకి వెళ్ళలేదు. ఏదేమైనా ఈ ఇద్దరు దర్శకులకూ బాలకృష్ణతో ఉన్న అనుబంధం ప్రత్యేకమైంది. ఇప్పటికీ బాలకృష్ణ డేట్స్ ఇస్తే సూపర్ హిట్ మూవీ చేయాలని వీరిద్దరూ ఎదురుచూస్తున్నారు. మంగళవారం (జూన్ 10)న తాము అతిథులుగా హాజరైన 'పా.. పా' ట్రైలర్ లాంచ్ లో బాలకృష్ణ పేరుతో కేక్ కట్ చేసి, ఒకరికి ఒకరు తినిపించుకున్నారు.
Also Read: Ustaad Bhagat Singh: ఉస్తాద్ సెట్ లో అడుగుపెట్టిన పవన్ .. వీడియో రిలీజ్
Also Read: Suriya 46: సూర్య, వెంకీ అట్లూరి మూవీ షూటింగ్ షురూ
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి