Premalu 2: ఆగిపోయిన ప్రేమలు సీక్వెల్ .. ?

ABN , Publish Date - Jun 11 , 2025 | 04:15 PM

గతేడాది రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకున్న సినిమాల్లో ప్రేమలు(Premalu) ఒకటి.  చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది. 

Premalu 2

Premalu 2:  గతేడాది రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకున్న సినిమాల్లో ప్రేమలు(Premalu) ఒకటి.  చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది. నస్లేన్ కె. గఫూర్(Naslen k Gafoor), మమితా బైజు(Mamitha Baiju) జంటగా నటించిన ఈ సినిమాకు గిరీష్ ఏడీ(Girish AD) దర్శకత్వం వహించాడు. భావన స్టూడియోస్ బ్యానర్‌పై ఫహద్ ఫాసిల్, దిలీష్ పోతన్, శ్యామ్ పుష్కరన్ నిర్మించిన ఈ సినిమా మలయాళంలో భారీ విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమాను   తెలుగులో ఎస్ ఎస్ కార్తికేయ రిలీజ్ చేశాడు. 

 

గతేడాది మార్చి 8 న రిలీజ్ అయిన ఈ సినిమా ఇక్కడ కూడా భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా రికార్డ్ కలక్షన్స్  రాబట్టింది. ఇక ప్రేమలు ఇచ్చిన కాన్ఫిడెన్స్ తో మేకర్స్.. ఈ సినిమాకు సీక్వెల్ అనౌన్స్ చేశారు. హీరోహీరోయిన్లను మార్చకుండా.. కథకు కొనసాగింపుగా డైరెక్టర్ సీక్వెల్ ను తెరకెక్కించే పనిలో పడ్డాడు. శరవేగంగా షూటింగ్ కూడా జరిగింది. ఎప్పుడెప్పుడు ఈ సినిమా  రిలీజ్ అవుతుందా అని ఎదురుచూస్తున్న అభిమానులకు షాక్ కొట్టేలా ఒక వార్త బయటకు వచ్చింది.

 

 అందుతున్న సమాచారం ప్రకారం ప్రేమలు 2 ఆగిపోయిందని సమాచారం. హీరోగా నటించిన నస్లేన్ కె. గఫూర్ కు సీక్వెల్ ఫైనల్ వెర్షన్ నచ్చలేదని, దాంతో పాటు వేరే సినిమాలు కూడా చేస్తుండడంతో డేట్స్  అడ్జెస్ట్ చేయలేక అతని ఈ సినిమా నుంచి తప్పుకున్నాడని  వార్తలు వినిపిస్తున్నాయి. ప్రేమలు సినిమాకు హైలైట్ అంటేనే  నస్లేన్ యాక్టింగ్. సచిన్ పాత్రలో అతని నటనకు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఇప్పుడు సీక్వెల్ లో అతను లేకపోతే.. అసలు ప్రేమలు 2 తీసి వేస్ట్ అనేది కొందరి భావన. పోనీ, కొత్త హీరోతో  తెరకెక్కిస్తే... మొదటి పార్ట్ హీరోతో కంపేర్ చేస్తూ ట్రోల్ చేస్తారు. అందుకే బాగా ఆలోచించి  మేకర్స్ ఈ సినిమాను మధ్యలో ఆపేశారని సమాచారం. ఇంకోపక్క  మాలీవుడ్  మీడియా.. ప్రేమలు 2 కు బ్రేక్ మాత్రమే పడిందని, పూర్తిగా ఆగిపోలేదని చెప్పుకొస్తుంది. ప్రస్తుతం డైరెక్టర్ కొత్త వెర్షన్ ను రాసే పనిలో ఉన్నాడని, అది పూర్తి అయ్యాక మళ్లీ ఈ సినిమా పట్టాలెక్కుతోందని అంటున్నారు. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది. 

Updated Date - Jun 11 , 2025 | 04:15 PM