తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ జ్ఞాపిక

ABN , Publish Date - Jun 10 , 2025 | 05:33 AM

తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రతిభ కలిగిన కళాకారులను, ఉత్తమాభిరుచితో నిర్మించిన చిత్రాలను ప్రోత్సహించడం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ను...

తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రతిభ కలిగిన కళాకారులను, ఉత్తమాభిరుచితో నిర్మించిన చిత్రాలను ప్రోత్సహించడం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ను ప్రకటించిన సంగతి విదితమే. ఈ నెల 14న ఎంతో వైభవంగా జరిగే కార్యక్రమంలో విజేతలకు అవార్డులను అందజేస్తారు. ఈ సందర్భంగా విజేతలకు అందించే అవార్డుల జ్ఞాపికను రాష్ట్రప్రభుత్వం విడుదల చేసింది. ఫిల్మ్‌ రీల్‌ను చేతికి చుట్టుకున్నట్లుగా.. పైకెత్తిన చేతిలో కంజెర నమునాతో గద్దర్‌ అవార్డ్‌ను తీర్చిదిద్దారు. కంజెరపై తెలంగాణ రాష్ట్ర చిహ్నాన్ని ముద్రించి చుట్టూ టీజీఎ్‌ఫఏ అక్షరాలను ఉంచారు.

Updated Date - Jun 10 , 2025 | 05:33 AM