PaPa Trailer: తమిళ బ్లాక్ బస్టర్ డాడా.. తెలుగు ట్రైలర్ వచ్చేసింది
ABN , Publish Date - Jun 11 , 2025 | 01:43 PM
రెండేండ్ల క్రితం అనామకంగా వచ్చి తమిళనాట సంచలన విజయం సాధించిన చిత్రం డా డా. కవిన్ , అపర్ణా దాస్ జంటగా నటించిన ఈ మూవీని పా పా పేరుతో తెలుగులోకి తీసుకు వస్తున్నారు.
రెండేండ్ల క్రితం అనామకంగా వచ్చి తమిళనాట సంచలన విజయం సాధించిన చిత్రం డా డా. కవిన్ (Kavin), అపర్ణా దాస్ (Aparna Das) జంటగా నటించిన ఈ మూవీని పా పా (PaPa) పేరుతో తెలుగులోకి తీసుకు వస్తున్నారు. గణేష్ కె బాబు దర్శకత్వం వహించగా జేకే ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై నిర్మాత నీరజ కోట తెలుగు ఆడియెన్స్ ముందుకు తీసుకొస్తున్నారు. ఈ నెల 13న ఈ సినిమాథియేటర్లో విడుదలకు రెడీ అయింది. ఈ క్రమంలో పా పా చిత్ర ట్రైలర్ ను ప్రముఖ దర్శకులు ఎ. కోదండరామిరెడ్డి, బి. గోపాల్ రిలీజ్ చేశారు.
ఈ సందర్భంగా దర్శకుడు ఎ. కోదండరామిరెడ్డి మాట్లాడుతూ.. ఇప్పుడే పా పా మూవీ ట్రైలర్ చూశాను. చాలా బాగుంది. ఈ చిత్రంలో హీరో హీరోయిన్స్ తో పాటు వారి బాబు పాత్రకు చాలా ఇంపార్టెన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. మంచి ఎమోషనల్ ఫ్యామిలీ మూవీగా ప్రేక్షకుల్ని ఈ సినిమా ఆకట్టుకోవాలి. కొత్త ప్రొడ్యూసర్ నీరజ కోట గారికి పా పా చిత్రంతో ఘన విజయం దక్కాలి అన్నారు. దర్శకుడు బి.గోపాల్ మాట్లాడుతూ.. సురేష్ కొండేటి ఎన్నో తమిళ చిత్రాలు తెలుగులోకి తీసుకొచ్చి మంచి విజయాలు అందుకున్నారు. డా డా సినిమా తమిళంలో రూ.42 కోట్లు వసూలు చేసింది. ఇప్పుడు తెలుగులో రిలీజ్ అవుతోంది. సాంగ్స్ బాగున్నాయి, ట్రైలర్ ఆకట్టుకుంది. ఎమోషన్స్, ఫ్యామిలీ డ్రామా బాగున్నాయి. ఈ సినిమా మంచి విజయం సాధించి నిర్మాత నీరజ కోట గారికి పేరు, డబ్బు తీసుకురావాలని కోరుకుంటున్నా అన్నారు.
ప్రొడ్యూసర్ నీరజ కోట, భర్త శశికాంత్లు మాట్లాడుతూ.. మా జేకే ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ మీద చేస్తున్న ఫస్ట్ మూవీ పా పా. ఈ చిత్రం తమిళంలో ఘన విజయం సాధించింది. అలాంటి విజయమే తెలుగు ప్రేక్షకులు కూడా మాకు అందిస్తారని కోరుకుంటున్నామన్నారు. మనుషులుగా మనం ఎంత ఆధునిక జీవితాన్ని సాగిస్తున్నా మనలోని హ్యూమన్ ఎమోషన్స్, విలువలు మారవు. అవి అలాగే ఉంటాయని చెప్పే చిత్రమిది. మేము ఈ చిత్రాన్ని తీసుకున్నాక...ఇండస్ట్రీలోని కొందరు పెద్ద మనుషుల నుంచి తమకు సినిమా ఇవ్వమని ఒత్తిడి చేశారు. ఈ సినిమాను రీమేక్ చేయాలనే ఆలోచన కూడా చేశాం. అయితే రీమేక్ చేస్తే ఒరిజినల్ మూవీలోని ఎమోషన్స్ పండవు అనిపించింది. అందుకే డబ్ చేశామన్నారు.