Dhanush: నా మనసుకు దగ్గరైన సినిమా

ABN , Publish Date - Jun 11 , 2025 | 05:37 AM

‘‘కుబేర’ నా కెరీర్‌లో ప్రత్యేక చిత్రం. నా మనసుకు దగ్గరైన సినిమా. ఈ సినిమా షూటింగ్‌ ఓ మరపురాని అనుభవం. నాగార్జునతో కలసి పనిచేయడం చాలా ఆనందాన్నిచ్చింది...

kubera

‘‘కుబేర’ నా కెరీర్‌లో ప్రత్యేక చిత్రం. నా మనసుకు దగ్గరైన సినిమా. ఈ సినిమా షూటింగ్‌ ఓ మరపురాని అనుభవం. నాగార్జునతో కలసి పనిచేయడం చాలా ఆనందాన్నిచ్చింది. ఈ సినిమాలో బిచ్చగాడి పాత్ర చేశాను. ఈ పాత్ర కోసం నేను ముందస్తుగా సన్నద్ధమవ్వలేదు. మా దర్శకుడు శేఖర్‌ కమ్ముల చెప్పింది చేశా. ఆయనో అద్భుతమైన దర్శకుడు. డంపింగ్‌ యార్డ్‌ సన్నివేశాలు చేసేటప్పుడు సైతం రష్మిక ఎలాంటి ఇబ్బంది లేకుండా నటించడం చూసి ఆశ్చర్యపోయాను. ఈ సినిమా తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది’ అని హీరో ధనుష్‌ అన్నారు. ఈ నెల 20న కుబేర విడుదలవుతోంది. ఈ సందర్భంగా ముంబైలో నిర్వహించిన కార్యక్రమంలో చిత్రబృందం ‘పీ పీ డుమ్‌ డుమ్‌’ అంటూ సాగే గీతాన్ని విడుదల చేసింది. ఈ చిత్రంలో కీలకపాత్ర పోషించిన నాగార్జున మాట్లాడుతూ ‘15 ఏళ్లుగా శేఖర్‌తో సినిమా చేయాలనుకుంటున్నాను. ‘కుబేర’తో తీరింది. ధనుష్‌, రష్మిక ప్రతిభావంతులైన కళాకారులు. చాలా గొప్పగా నటించారు. సినిమా ఘన విజయం అందుకుంటుంది’ అని చెప్పారు. రష్మిక మాట్లాడుతూ ‘నటిగా ‘కుబేర’ విభిన్నమైన అనుభూతిని ఇచ్చింది. నా పాత్ర ప్రేక్షకులను సర్‌ప్రైజ్‌ చేస్తుంది. అభిమానుల స్పందన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను’ అని తెలిపారు. సునీల్‌ నారంగ్‌, పుష్కర్‌ రామ్‌మోహన్‌ నిర్మించారు.

Updated Date - Jun 11 , 2025 | 06:07 AM