అల్లు అట్లీ సినిమాలో దీపిక

ABN , Publish Date - Jun 08 , 2025 | 04:08 AM

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా అట్లీ ఓ చిత్రాన్ని తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. ‘ఏఏ 22.. అట్లీ 6’ అనేది వర్కింగ్‌ టైటిల్‌. సన్‌ పిక్చర్స్‌ పతాకంపై కళానిధి మారన్‌ నిర్మిస్తున్నారు...

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా అట్లీ ఓ చిత్రాన్ని తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. ‘ఏఏ 22.. అట్లీ 6’ అనేది వర్కింగ్‌ టైటిల్‌. సన్‌ పిక్చర్స్‌ పతాకంపై కళానిధి మారన్‌ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమాలోకి బాలీవుడ్‌ హీరోయిన్‌ దీపికా పదుకోన్‌ను ఆహ్వానిస్తూ మేకర్స్‌ ‘ఫేసెస్‌ ఆఫ్‌ ఏఏ 22.. అట్లీ 6’ పేరిట ఓ వీడియోను విడుదల చేశారు. ఇందులో దీపికకు అట్లీ స్ర్కిప్ట్‌ వివరించడం.. ఆమెకు లుక్‌ టెస్ట్‌ చేయడం వంటివి చూపించారు. ఇందులో ఆమెది యాక్షన్‌కు అధిక ప్రాధాన్యమున్న శక్తిమంతమైన పాత్రని తెలుస్తోంది. ఈ సందర్భంగా దర్శకుడు అట్లీ మాట్లాడుతూ ‘‘దీపిక అద్భుతమైన నటి. సినిమాలో ఆమె పాత్ర ఎంతో కీలకంగా ఉండబోతోంది. ఈ చిత్రంతో ప్రేక్షకులకు మరిచిపోలేని ఓ గొప్ప సినిమాటిక్‌ అనుభూతిని అందివ్వబోతున్నాం’’ అని అన్నారు.

Updated Date - Jun 08 , 2025 | 04:08 AM