Ustaad Bhagat Singh: ఉస్తాద్ సెట్ లో అడుగుపెట్టిన పవన్ .. వీడియో రిలీజ్
ABN , Publish Date - Jun 11 , 2025 | 03:02 PM
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan).. రాజకీయాల్లోకి వచ్చాక పార్టీ ఫండ్ కోసం మూడు సినిమాలను లైన్లో పెట్టి.. ఆ సినిమాలకు ఇచ్చిన అడ్వాన్స్ లతో పార్టీని నడిపాడు.
Ustaad Bhagat Singh: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan).. రాజకీయాల్లోకి వచ్చాక పార్టీ ఫండ్ కోసం మూడు సినిమాలను లైన్లో పెట్టి.. ఆ సినిమాలకు ఇచ్చిన అడ్వాన్స్ లతో పార్టీని నడిపాడు. అలా లైన్లో పెట్టిన సినిమాలే హరిహర వీరమల్లు(HariHara Veeramallu), OG, ఉస్తాద్ భగత్ సింగ్(Ustaad Bhagat Singh). ఇక దాదాపు పదేళ్ల తరువాత పవన్.. పదవిని అందుకున్నాడు. డిప్యూటీ సీఎం అయ్యాక సినిమాల పరిస్థితి ఏంటి అనుకున్నారు కానీ, పవన్ మాత్రం నిర్మాతలను గౌరవించి, సమయం చూసుకొని ఒక్కో సినిమాను ఫినిష్ చేస్తూ వస్తున్నాడు.
ఇప్పటికే వీరమల్లు, OG షూటింగ్స్ ను పూర్తిచేశాడు. ఇక చివరగా ఉస్తాద్ షూటింగ్ ను కూడా ముగించే పనిలో పడ్డాడు. హరీష్ శంకర్(Harish Shankar) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్నీ మైత్రీ మూవీ మేకర్స్(Mythri Movie Makers) నిర్మిస్తుంది. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో పవన్ సరసన శ్రీలీల(Sreeleela) నటిస్తోంది. కోలీవుడ్ లో భారీ విజయాన్ని అందుకున్న తేరి(Theri) సినిమాకు రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కుతుంది. కేవలం ఆ లైన్ మాత్రం తీసుకొని హరీష్.. తన స్టైల్ లో రూపొందిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
పవన్ రాజకీయాల్లో బిజీగా ఉండడంతో అసలు ఉస్తాద్ పట్టాలెక్కదు అని అనుకున్నారు. ఎట్టకేలకు మంగళవారం ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్ళింది. ఇందుకు సంబందించిన ఒక వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు. పవన్ సెట్స్ లోకి అడుగుపెట్టగానే మైత్రీ అధినేతల్లో ఒకరైన రవి శంకర్.. బొకే ఇచ్చి మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు. ఈ షెడ్యూల్ లో పవన్ తో పాటు శ్రీలీల కూడా జాయిన్ అయ్యిందని తెలుస్తోంది. వారిద్దరిపై కొన్ని కీలక సన్నివేశాలను షూట్ చేశారని సమాచారం. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ సినిమా ఎప్పుడు ఫినిష్ అయ్యి.. ఎప్పుడు రిలీజ్ కు రెడీ అవుతుందో చూడాలి.