MAA: డ్రగ్స్ రహిత తెలంగాణ కోసం...

ABN , Publish Date - Jun 11 , 2025 | 04:38 PM

డ్రగ్స్ రహిత తెలంగాణ కోసం ప్రభుత్వ సంస్థలే కాదు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ సైతం తమ వంతు సహకరిస్తోంది. తాజాగా ఆపరేషన్ సంకల్స్ లో మా సైతం భాగస్వామిగా మారింది.

తెలంగాణను డ్రగ్స్ ఫ్రీ స్టేట్ గా చేయాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. అందుకు అన్ని రకాల ప్రయత్నాలు ఆయన చేస్తున్నారు. సంబంధిత అధికారులతో సమావేశం అవుతూ, ఏ స్థాయి వ్యక్తులకు డ్రగ్స్ దందాతో సంబంధం ఉన్నా నిర్మొహమాటంగా చర్యలు తీసుకోమని ఆదేశిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చాలనే లక్ష్యంతో, తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో (TGANB), మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (MAA), తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్, సివిల్ ఫోర్స్ ట్రస్ట్ భాగస్వామ్యంతో 'ఆపరేషన్ సంకల్ప్'ను ప్రారంభించారు.


ఈ కార్యక్రమంలో TGANB డైరెక్టర్ సందీప్ శాండిల్య, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ మాదాల రవి, TGANB ఎస్పీ పి. సీతారామ, డిపార్ట్‌మెంట్ ఫర్ ది ఎంపవర్‌మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ (DEPWD) డైరెక్టర్ శైలజ గారు తదితరులు హాజరయ్యారు. డ్రగ్స్ రహిత తెలంగాణను నిర్మించే దిశగా ఇది తమ శక్తివంతమైన తొలి అడుగు అని వారు తెలిపారు.

Also Read: Balakrishna: బాలయ్య బర్త్ డేను ఆ రకంగా ఆ ఇద్దరూ...

Also Read: Premalu 2: ఆగిపోయిన ప్రేమలు సీక్వెల్ .. ?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - Jun 11 , 2025 | 04:39 PM