ట్రైలర్‌కు ముహూర్తం ఫిక్స్
ABN , Publish Date - Jun 10 , 2025 | 05:37 AM
నితిన్ కథానాయకుడిగా శ్రీరామ్ వేణు తెరకెక్కిస్తున్న చిత్రం ‘తమ్ముడు’. ‘కాంతార’ ఫేమ్ సప్తమి గౌడ, వర్ష బొల్లమ్మ, లయ కీలక పాత్రలు పోషిస్తున్నారు...
నితిన్ కథానాయకుడిగా శ్రీరామ్ వేణు తెరకెక్కిస్తున్న చిత్రం ‘తమ్ముడు’. ‘కాంతార’ ఫేమ్ సప్తమి గౌడ, వర్ష బొల్లమ్మ, లయ కీలక పాత్రలు పోషిస్తున్నారు. దిల్‌రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను బుధవారం విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు మేకర్స్. ఈ మేరకు ఓ ఆసక్తికరమైన వీడియోను సోషల్‌మీడియా ద్వారా పంచుకున్నారు. ఇది ప్రస్తుతం అందర్నీ ఆకర్షిస్తోంది. జూలై 4న చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ చిత్రానికి ఎడిటర్:ప్రవీణ్ పూడి, సినిమాటోగ్రఫీ:కేవీ గుహన్, సంగీతం: అజనీష్ లోక్‌నాథ్.