సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

The Paradise: జ‌డ‌ల్‌.. సెన్సార్ క‌త్తెర‌కు బాగానే ప‌ని చెప్పాడుగా

ABN, Publish Date - Sep 22 , 2026 | 01:19 PM

నాని , శ్రీకాంత్ ఓదెల కాంబోలో రానున్న 'ది ప్యారడైజ్ సెన్సార్ పూర్తి కావడంతో అనూహ్యమైన పొలిటికల్ దుమారం రేగింది.

Nani

నాని (Nani), శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) కాంబోలో రానున్న 'ది ప్యారడైజ్స‌ (The Paradise) సెన్సార్ పూర్తికావడంతో అనూహ్యమైన పొలిటికల్ దుమారం రేగింది. కేవలం రా యాక్షన్ మాత్రమే కాక, సమకాలీన రాజకీయ నాయకుల పేర్లు, వ్యవస్థను ఎండగట్టే వివాదాస్పద డైలాగులు ఉండటంతో సెన్సార్ బోర్డు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.

రాజకీయ అంశాలతో పాటు తీవ్రమైన హింస, రక్తపాతం దృశ్యాలపై దృష్టి సారించిన బోర్డు.. ఏకంగా 21 మార్పులను ఆదేశించి పలు సన్నివేశాలను తొలగించి రీప్లేస్ చేయించింది. అన్ని కట్స్ తర్వాత ఈ సినిమా నిడివి 2 గంటల 54 నిమిషాలుగా ఖరారవగా, దర్శకుడు సమాజ వాస్తవాలను ఎంత బోల్డ్‌గా చూపించారో ఈ రిపోర్ట్ స్పష్టం చేస్తోంది. సెప్టెంబర్ 24న థియేటర్లలోకి రానున్న ఈ భారీ పీరియాడిక్ డ్రామా ఎలాంటి పొలిటికల్, బాక్సాఫీస్ సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

గంటలోనే.. 25 వేలకు పైగా బుకింగ్స్‌

ఇదిలాఉంటే.. సెన్సార్ ప‌రంగా సినిమా అనేక అబ్య‌త‌రాలు ఎదుర్కొన్న‌ప్ప‌టికీ టికెట్ అడ్వ‌న్స్ బుకింగ్స్ విష‌యంలో మాత్రం దూసుకు వెళుతోంది. 'దసరా' తర్వాత నాని, శ్రీకాంత్ ఓదెల క్రేజీ కాంబోలో వస్తున్న రా అండ్ రస్టిక్ యాక్షన్ డ్రామా కావ‌డంతో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ దగ్గర విధ్వంసానికి తెరతీసింది. సెప్టెంబర్ 24న రిలీజ్ కానున్న ఈ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ నైజాంలో ఓపెన్ కాగానే పోర్టల్స్ షేక్ అవుతూ టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి.

కేవలం గంట వ్యవధిలోనే బుక్‌మైషో, డిస్ట్రిక్ట్ యాప్‌లలో కలిపి 25 వేలకు పైగా టికెట్లు తెగిపోవడం ట్రేడ్ వర్గాలను విస్మయానికి గురిచేస్తోంది. నైజాంలోనే పరిస్థితి ఇలా ఉంటే, ఆంధ్రాతో పాటు సీడెడ్, ఓవర్సీస్ బుకింగ్స్ కూడా మొదలైతే రికార్డులు తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది. మురికివాడ నేపథ్యంలో సాగే ఈ పీరియాడిక్ క్రైమ్ డ్రామాతో నాని కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ నమోదు కావడం పక్కా అనిపిస్తోంది.

Updated Date - Sep 22 , 2026 | 01:21 PM