కర్ణుడిగా రాఘవ లారెన్స్.. భారీ బడ్జెట్‌ పాన్ ఇండియా చిత్రం!

ABN , Publish Date - Sep 22 , 2026 | 03:07 PM

కొరియోగ్రాఫర్, దర్శకుడు, నటుడు రాఘవ లారెన్స్ (Raghava lawrence) తొలిసారిగా పౌరాణిక పాత్రలో అలరించేందుకు సిద్ధమయ్యారు.

Raghava lawrence, karna

కొరియోగ్రాఫర్, దర్శకుడు, నటుడు రాఘవ లారెన్స్ (Raghava lawrence) తొలిసారిగా పౌరాణిక పాత్రలో అలరించేందుకు సిద్ధమయ్యారు. మహాభారతంలోని కర్ణుడి (karna) జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ‘మహావీర్ కర్ణ’ (Mahaveer Karna) చిత్రంలో ఆయన ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.

బెల్లంకొండ శ్రీనివాస్ న‌టించిన ‘రాక్షసుడు’ ఫేమ్ రమేష్ వర్మ (Ramesh Varma) దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మైథలాజికల్ యాక్షన్ డ్రామా చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్‌ను లారెన్స్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేశారు. యుద్ధ వీరుడి గెటప్‌లో లారెన్స్ లుక్ ఆకట్టుకుంటోంది.

Raghava lawrence, karna

ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ పెన్ స్టూడియోస్ సుమారు ₹150 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళం, హిందీతో పాటు ప్రధాన భారతీయ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో 2027లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

లారెన్స్ కెరీర్‌లోనే ఇది మొదటి మైథలాజికల్ ప్రాజెక్ట్ కావడంతో సినీ వర్గాల్లో భారీ ఆసక్తి నెలకొంది. ఇదిలాఉంటే.. లారెన్స్ స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిస్తున్న కాంచ‌న 4 చిత్రం ప్ర‌స్తుతం షూటింగ్ ద‌శ‌లో ఉండ‌గా 2027 వేస‌వికి థియేట‌ర్ల‌కు రానుంది.


ఇవి కూడా.. చ‌ద‌వండి

OTT Movies: ఈ వారం.. ఓటీటీ సినిమాలు, వెబ్ సిరీస్‌ల జాబితా

థియేటర్లు ఊగిపోతయ్‌.. ఇది జడల్‌ గాని వాదా

'రాకా' సర్‌ప్రైజ్‌.. ఫ్యాన్స్‌ డిజప్పాయింట్?

Nidhhi Agerwal: మంచి క‌థ, పాత్ర‌ల‌కు.. త‌మిళ సినీ రంగ‌మే ఉత్త‌మం

The Paradise: జ‌డ‌ల్‌.. సెన్సార్ క‌త్తెర‌కు బాగానే ప‌ని చెప్పాడుగా

ఆస్కార్‌ రేసులో మరో.. భార‌తీయ సినిమా

‘రా’ వ్యవస్థాపకుడి బయోపిక్

‘వారణాసి’ నుంచి బిగ్ లీక్..

Updated Date - Sep 22 , 2026 | 04:03 PM