‘రా’ వ్యవస్థాపకుడి బయోపిక్‌

ABN , Publish Date - Sep 22 , 2026 | 09:11 AM

వెండితెరపై బయోపిక్‌ల ట్రెండ్‌ నడుస్తున్న తరుణంలో.. మరో నిజజీవిత కథ ప్రేక్షకులను పలకరించనుంది.

Rameshwar Nath Kao

వెండితెరపై బయోపిక్‌ల ట్రెండ్‌ నడుస్తున్న తరుణంలో.. మరో నిజజీవిత కథ ప్రేక్షకులను పలకరించనుంది. భారత విదేశీ నిఘా సంస్థ ‘రా’(రీసెర్చ్‌ అండ్‌ అనాలిసిస్‌ వింగ్‌) వ్యవస్థాపకుడు రామేశ్వర్‌ నాథ్‌ కావో (Rameshwar Nath Kao) జీవిత చరిత్రను ఓ భారీ స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌గా నిర్మాత కరణ్‌ జోహార్‌ తన ధర్మ ప్రొడక్షన్స్‌పై రూపొందించనున్నారు. RAW Founder Biopic

నితిన్‌ గోఖలే రచించిన ‘జెంటిల్‌మెన్‌ స్పైమాస్టర్‌’ పుస్తకం ఆధారంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో ఓ అగ్ర కథానాయకుడు నటించనున్నారు. 1968లో ఏర్పాటైన ‘రా’కు సోమవారంతో 58 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సంస్థ 60 ఏళ్లను పురస్కరించుకుని 2028 ఆగస్టు 11న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ‘రా’కు ఘనంగా నివాళులర్పించేలా ఓ అద్భుతమైన చిత్రాన్ని మీ ముందుకు తీసుకురాబోతున్నాం’ అని కరణ్‌ జోహార్ ( Karan Johar ) పేర్కొన్నారు.

Updated Date - Sep 22 , 2026 | 09:15 AM