‘ది ప్యారడైజ్’ అడ్వాన్స్ బుకింగ్స్.. అసలు ఊహించలేదు కదా

ABN , Publish Date - Sep 21 , 2026 | 08:28 PM

‘దసరా’ వంటి సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్ తర్వాత నేచురల్ స్టార్ నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తోన్న మోస్ట్ అవేటెడ్ పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘ద ప్యారడైజ్’. ఈ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ ఓ రేంజ్‌లో మొదలయ్యాయి.

The Paradise Advance Bookings

బాక్సాఫీస్ దగ్గర మరో భారీ విధ్వంసానికి రంగం సిద్ధమైంది. ‘దసరా’ (Dasara) వంటి సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్ తర్వాత నేచురల్ స్టార్ నాని (Natural Star Nani), డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) కాంబినేషన్‌లో వస్తోన్న మోస్ట్ అవేటెడ్ పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘ద ప్యారడైజ్’ (The Paradise). సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమాపై టాలీవుడ్ సహా పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు నెలకొన్నాయి. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో చిత్ర యూనిట్ అడ్వాన్స్ బుకింగ్స్‌ను (The Paradise Advance Bookings) ప్రారంభించింది. టికెట్ విండోస్ ఓపెన్ అయిన నిమిషాల వ్యవధిలోనే బుకింగ్స్ పోర్టల్స్ షేక్ అవుతున్నాయి.


ప్రస్తుతానికి కేవలం నైజాం ఏరియాలోనే పరిమితంగా బుకింగ్స్ తెరిచారు. హైదరాబాద్‌లోని ప్రధాన మల్టీప్లెక్స్‌లు, సింగిల్ స్క్రీన్స్‌లో టికెట్లు తెరుచుకున్న వెంటనే క్షణాల్లో ఫాస్ట్ ఫిల్లింగ్, సోల్డ్ ఔట్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. బుక్‌మైషో, డిస్ట్రిక్ట్ యాప్‌లలో కలిపి కేవలం గంట వ్యవధిలోనే దాదాపు 25 వేలకు పైగా టికెట్లు తెగిపోవడం ట్రేడ్ వర్గాలను సైతం విస్మయానికి గురిచేస్తోంది. ఇందులో ఒక్క బుక్‌మైషో పోర్టల్‌లోనే గంటకు 17 వేలకు పైగా టికెట్లు బుక్ అయ్యాయంటే క్రేజ్ ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు. డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లో ఈ సినిమాకు వస్తున్న ఇంట్రెస్ట్ కూడా కనీవినీ ఎరుగని రీతిలో ఉంది. ఒక్క బుక్‌మైషోలోనే 3.34 లక్షల మంది, డిస్ట్రిక్ట్ యాప్‌లో 2.64 లక్షల మంది ప్రేక్షకులు ఈ చిత్రంపై ఆసక్తి వ్యక్తం చేశారు. కేవలం నైజాం పరిధిలోనే ఇంతటి అద్భుతమైన స్పందన లభిస్తుంటే, ఆంధ్రాతో పాటు సీడెడ్, ఓవర్సీస్ మార్కెట్లలో కూడా పూర్తిస్థాయి బుకింగ్స్ ఓపెన్ అయితే బాక్సాఫీస్ నెంబర్లు సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.


సికింద్రాబాద్‌లోని ఓ మురికివాడ నేపథ్యంలో, అత్యంత రా అండ్ రస్టిక్ పీరియాడిక్ క్రైమ్ డ్రామాగా ఈ చిత్రాన్ని దర్శకుడు శ్రీకాంత్ ఓదెల రూపొందించారు. ఫస్ట్ లుక్ గ్లింప్స్ నుంచి మొదలుకొని టీజర్, ట్రైలర్ వరకు ప్రతి ప్రచార చిత్రం ప్రేక్షకుల్లో అంచనాలను ఆకాశానికి తీసుకెళ్లింది. గతంలో ‘దసరా’తో 100 కోట్ల క్లబ్‌లో అడుగుపెట్టిన ఈ కాంబో, ఈసారి అంతకుమించిన కంటెంట్‌తో థియేటర్లను షేక్ చేయబోతోందనే నమ్మకం ప్రేక్షకుల్లో బలంగా ఉంది. విడుదల రోజున నాని కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ నమోదయ్యే దిశగా ‘ద ప్యారడైజ్’ బాక్సాఫీస్ ప్రయాణం దూసుకుపోతోంది.

ఇవి కూడా చదవండి:

మెగాస్టార్‌తో బుచ్చిబాబు.. నిర్మాణ సంస్థ కూడా రెడీ!

జనసైనికుడి కుటుంబానికి నాగబాబు ఓదార్పు

46 కోట్లు కొట్టేయడానికి కుట్ర.. తోడబుట్టిన వారిపై నటి రాధ ఫిర్యాదు

Updated Date - Sep 21 , 2026 | 08:28 PM