Nidhhi Agerwal: మంచి కథ, పాత్రలకు.. తమిళ సినీ రంగమే ఉత్తమం
ABN , Publish Date - Sep 22 , 2026 | 01:52 PM
తన గమ్యాన్ని చేరుకునేంత వరకు ప్రయత్నిస్తూనే ఉంటానని హీరోయిన్ నిధి అగర్వాల్ అన్నారు.
తన లక్ష్యాలే తనకు ప్రేరణ ఇస్తాయని, తాను స్వతహాగా కష్టపడి పనిచేసే వ్యక్తినని, ముఖ్యంగా గమ్యాలను చేరుకునేంత వరకు ప్రయత్నిస్తూనే ఉంటానని హీరోయిన్ నిధి అగర్వాల్ (Nidhhi Agerwal) అన్నారు.
ఆమె తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. పలు భాషల్లో నటిస్తూ మంచి కథలు, మంచి పాత్రల ద్వారా నటనను మరింతగా మెరుగు పరుచుకునేందుకు కృషి చేస్తున్నాను.
ప్రముఖ హీరోలతో పెద్ద సినిమాలు చేసే సమయంలో ప్రాముఖ్యత లేని పాత్రలకే నన్ను నేను పరిమితం చేసుకోవాలని అనుకోవడం లేదు.
నటిగా నా ప్రతిభ నిరూపించుకోవడానికి మంచి కథాంశాలున్న సినిమాలు, పాత్రల కోసం ఎదురు చూస్తున్నాను. దీనికి తమిళ సినీ రంగం సరైన వేదికగా భావిస్తున్నాను.
అందుకే కోలీవుడ్‌పై ఎక్కువగా దృష్టిసారిస్తాను. అభిమానుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయే మంచి పాత్రల్లో నటించాలన్నదే నా కోరిక తమిళం వంటి విభిన్న భాషా చిత్రాల్లో పని చేయడం కూడా నాకు మంచి అనుభవాన్ని ఇచ్చింది' అని పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి:
‘ది ప్యారడైజ్’ అడ్వాన్స్ బుకింగ్స్.. అసలు ఊహించలేదు కదా
దర్శకుడు శ్రీను వైట్ల కూతురిని చూశారా.. హాలీవుడ్ మోడల్‌కు ఏమాత్రం తీసిపోదు
మెగాస్టార్‌తో బుచ్చిబాబు.. నిర్మాణ సంస్థ కూడా రెడీ!