రామ్ చరణ్ కష్టాన్ని మాటల్లో చెప్పలేను - ‘పెద్ది’ నిర్మాత
ABN, Publish Date - May 17 , 2026 | 10:15 PM
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న రూరల్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’. ఈ సినిమా విశేషాలను నిర్మాత వెంకట సతీష్ కిలారు మీడియాకు తెలిపారు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Mega Power Star Ram Charan) హీరోగా బుచ్చిబాబు సానా (Buchi Babu Sana) దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న రూరల్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ (Peddi Movie). మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు (Venkata Satish Kilaru) ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన చార్ట్ బస్టర్ పాటలు, పవర్‌ఫుల్ గ్లింప్స్‌తో సినిమాపై అంచనాలు భారీ స్థాయికి చేరుకున్నాయి. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రానున్న ఈ చిత్ర విశేషాలను నిర్మాత వెంకట సతీష్ కిలారు మీడియాతో పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
‘‘మా బ్యానర్‌లో చేస్తున్న మొదటి సినిమానే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో చేయడం, ఆయన నాకు సినిమా ఇవ్వడం నిజంగా నా అదృష్టం. ఆయన ఒప్పుకుంటేనే ఇది సాధ్యపడింది. ఈ సందర్భంగా ఆయనకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ సినిమాను మేము అనుకున్న బడ్జెట్‌లో, గ్రాండ్ స్కేల్‌లో చాలా అద్భుతంగా తెరకెక్కించాం. తొలి రోజు నుంచి చివరి రోజు వరకు అదే పాజిటివ్ ఎనర్జీతో టీమ్ అంతా పని చేశాం. షూటింగ్ చివరి రోజు హీరో, డైరెక్టర్ అందరూ చాలా ఎమోషనల్ అయ్యారు. ఈ సినిమా విషయంలో నేను ఎటువంటి ఛాలెంజెస్ ఫేస్ చేయలేదు. మా జర్నీ అంతా చాలా హ్యాపీగా సాగింది. తొలి రోజు నుంచి చివరి రోజు వరకు షూటింగ్ చాలా కూల్‌గా జరిగింది. బుచ్చిబాబు రెడీ చేసిన కథ మొత్తం అద్భుతం. సినిమా మొదలైనప్పటి నుంచి చివరి వరకు ప్రేక్షకులు థియేటర్‌లో ఒక ట్రాన్స్‌లో ఉండిపోతారు. కమర్షియల్ ఎలిమెంట్స్, ఎమోషన్స్… ప్రతిదీ ఎక్స్‌ట్రార్డినరీగా ఉంటుంది. ప్రేక్షకుడు సినిమాలో ఏం కోరుకుంటాడో, అవన్నీ ఒక పూర్తి ప్యాకేజ్‌లా బుచ్చిబాబు అందించారు.
రామ్ చరణ్ ఈ సినిమా కోసం ఎంత కష్టపడ్డారో మాటల్లో చెప్పలేం. అది స్క్రీన్‌పై చూసినప్పుడే ఆయన ట్రాన్స్‌ఫర్మేషన్ ఎంత అద్భుతంగా ఉందో ప్రేక్షకులకు అర్థమవుతుంది. సినిమా కోసం దాదాపు రెండేళ్ల పాటు ప్రత్యేక ట్రైనర్‌ని పెట్టుకొని ఆయన వర్క్ చేశారు. గాయాలను లెక్కచేయకుండా శరీరాన్ని హూనం చేసుకున్నారు. కంటికి కుట్లు వేసుకున్న మరుసటి రోజే షూటింగ్‌కు వచ్చారంటే.. ఆయన డెడికేషన్ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇది చాలా ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్ ఉన్న సినిమా. డైరెక్టర్ ఏది చెప్పారో, రామ్ చరణ్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఆ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. కొన్నిసార్లు ఆయన శరీరం సహకరించకపోయినా, ఫిజియో చేయించుకుని మరీ వెంటనే షూట్‌కు రెడీ అయ్యేవారు. ఆయన పడిన కష్టం ప్రేక్షకులు బిగ్ స్క్రీన్‌పై చూసి ఆశ్చర్యపోతారు’’ అని తెలిపారు.
ఇవి కూడా చదవండి:
Mega158: మాస్ వర్కవుట్స్‌తో మెగా158 అప్డేట్.. చిరు వీడియో వైరల్!
లేటు వయసులో ఖరీదైన 'పోర్షే' లగ్జరీ కారు.. సీనియర్ నరేశ్ జల్సానే జల్సా! ఖరీదెంతో తెలుసా?
Chiranjeevi: ‘పెద్ది’ ట్రైలర్ చూశా.. ఒక్కొక్కరు రఫ్ఫాడించేశారు!
Keneeshaa: 4 నెలల బిడ్డను కోల్పోయిన నేను.. జయం రవి జీవితం నాశనం చేస్తానా?