Peddi Movie: ముంబైలో ట్రైలర్ లాంచ్.. ఆ వెంటనే భోపాల్‌లో.. ఆట మొదలైంది!
ABN , Publish Date - May 13 , 2026 | 07:25 PM
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమాతో బాక్సాఫీస్ వద్ద తుఫాన్ సృష్టించేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్‌లో చరణ్ పవర్‌ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో కనిపించి.. ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు పెంచేసిన విషయం తెలిసిందే.
Peddi Movie: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Mega Power Star Ram Charan) ‘పెద్ది’ (Peddi) సినిమాతో బాక్సాఫీస్ వద్ద తుఫాన్ సృష్టించేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్‌లో చరణ్ పవర్‌ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో కనిపించి.. ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు పెంచేశారు. ఇప్పుడీ సినిమాకు పాన్ ఇండియా స్థాయిలో మ్యాసీవ్ ప్రమోషన్స్ ప్రారంభమవుతున్నాయి. ఇంకా చెప్పాలంటే ‘పెద్ది’ ప్రమోషన్స్ ఆట, వేట మొదలైంది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘పెద్ది’ థియేట్రికల్ ట్రైలర్ (Peddi Trailer)ను మే 18న ముంబైలో జరిగే గ్రాండ్ ఈవెంట్‌లో విడుదల చేయనున్నారు. ఈ ఈవెంట్ ద్వారా సినిమా భారీ కాన్వాస్‌ను జాతీయ మీడియా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు పరిచయం చేసేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
ముంబై ట్రైలర్ లాంచ్ తర్వాత కూడా టీమ్ భారీగా ప్లాన్ చేస్తోంది. ఈ కథ మూలాలను సెలబ్రేట్ చేయడానికి హార్ట్ ఆఫ్ ఇండియాగా పిలిచే భోపాల్‌కు వెళ్లనుంది. మే 23న అక్కడ స్పెషల్ సాంగ్ లాంచ్ ఈవెంట్ నిర్వహించనున్నారు. ఈ ఈవెంట్‌ను మరింత ప్రత్యేకంగా మార్చేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లుగా అధికారికంగా తెలిపారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ స్వయంగా ‘పెద్ది’ పాటలను లైవ్‌లో ఈ వేదికపై పెర్ఫార్మ్ చేయనున్నారు. అలాగే ‘సౌండ్ ఆఫ్ పెద్ది’ను విడుదల చేయనున్నారు. రెహమాన్‌తో పాటు పలువురు ప్రముఖ గాయకులు ఈ వేదికపై లైవ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వనున్నారు.
ఇక ఇప్పటికే విడుదలైన ‘చికిరి చికిరి’, ‘రైరై రారా’ పాటలు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అలాగే రామ్ చరణ్ గ్లింప్సెస్ ప్రేక్షకుల్లో అడ్రినలిన్ రష్‌ను కలిగించాయి. దీంతో సినిమాను బిగ్ స్క్రీన్‌పై చూసేందుకు అభిమానులు, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో నిర్మాత వెంకట సతీష్ కిలారు వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ‘పెద్ది’ ఓవర్సీస్ మార్కెట్‌లో ఇప్పటికే రికార్డుల వేట మొదలు పెట్టింది. కేవలం ప్రీమియర్స్‌కే నార్త్ అమెరికాలో ప్రీ-సేల్స్ రూపంలో ఈ సినిమా రికార్డులను నమోదు చేస్తోంది. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో శివ రాజ్‌కుమార్, జగపతిబాబు, దివ్యేందు శర్మ ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ‘పెద్ది’ 04 జూన్, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుండగా.. జూన్ 3న ప్రీమియర్స్ ప్రారంభం కానున్నాయి.
ఇవి కూడా చదవండి:
Prabhas: ‘బాహుబలి’ ప్రభాస్ చేసిన ఈ పని తెలిస్తే.. ఫ్యాన్ అయిపోవాల్సిందే!
రాజీనామా.. నట్టి కుమార్ సంచలన నిర్ణయం
పవన్ కళ్యాణ్, విజయ్‌ల విజయ రహస్యం అదే: ఆర్జే బాలాజీ
అందుకే తెలుగు రాష్ట్రాల్లో షూటింగ్ చేయడం లేదు- బోయపాటి శ్రీను