Peddi Movie: కథ విని, 20 నిమిషాల పాటు మనిషిని కాలేకపోయా- ప్రొడక్షన్ డిజైనర్
ABN , Publish Date - May 06 , 2026 | 09:34 PM
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తోన్న రూరల్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’. ఈ చిత్ర ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్లా మీడియాకు సినిమా విశేషాలను తెలియజేశారు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Mega Power Star Ram Charan) హీరోగా నటిస్తోన్న రూరల్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ (Peddi). ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చి బాబు సానా (Buchi Babu Sana) దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు భారీ స్థాయిలో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే చార్ట్ బస్టర్ పాటలు, అద్భుతమైన గ్లింప్స్‌తో సినిమాపై అంచనాలు భారీ స్థాయికి చేరుకున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలయ్యేందుకు సిద్ధమవుతోంది. మరోవైపు మేకర్స్ ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. అందులో భాగంగా ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్లా (Kolla Avinash) మీడియాకు సినిమా విశేషాలను తెలియజేశారు. ఆయన మాట్లాడుతూ..
‘‘నా పదేళ్ల కెరీర్‌లో ఒక కథకి ఇంతలా ఎక్సైట్ అవ్వడం నిజంగా ఇదే ఫస్ట్ టైమ్. డైరెక్టర్ కథ చెప్పిన తర్వాత దాదాపు 20 నిమిషాల పాటు నేను మనిషిని కాలేకపోయాను. అంతలా ఈ కథ నన్ను కదిలించింది. కథలోనే ఇంత బలం ఉంది కాబట్టి ప్రొడక్షన్ డిజైన్ పరంగా అన్ని విషయాల్లో చాలా కేర్ తీసుకోవాలని అప్పుడే డిసైడ్ అయ్యాను. ఒక సినిమాకు సెట్ వేసినప్పుడు అది ఆడియన్స్‌కి సెట్ అని తెలియకూడదు. అప్పుడే ఒక ఆర్ట్ డైరెక్టర్ సక్సెస్ అయినట్టు. నా వరకు ఈ సినిమాకి వేసిన సెట్స్‌ను ప్రేక్షకులు అవి సెట్స్ అని గ్రహించలేరు. అంత నేచురల్‌గా ఉంటాయి. ఇది 70-80లలో జరిగే కథ. ఇంతకు ముందు నేను పీరియడ్ సినిమాలు చేశాను. ఆ అనుభవం నాకు చాలా ఉపయోగపడింది.
‘పెద్ది’ విజయనగరం ఏరియాలో జరిగే కథ. అక్కడి వీధులు, క్లాక్ టవర్ ఇవన్నీ కూడా సినిమాలో రీ క్రియేట్ చేశాం. విజయనగరం చుట్టుపక్కల ప్రాంతాల డిజైన్ విషయంలో చాలా కేర్ తీసుకున్నాం. అలాగే కుస్తీ, క్రికెట్ ఆటల విషయానికి వస్తే.. ఇందులో ఇప్పటివరకు ఎవరూ చూడని కుస్తీ సెటప్ చేశాం. దానికోసం అండర్‌గ్రౌండ్ సెటప్‌లో షూట్ చేశాం. చరణ్ గదతో కనిపించిన షాట్ అక్కడే చేశాం. డీవోపీ, ఆర్ట్ డైరెక్టర్.. ఒక సింక్‌లో ఉంటే సినిమా ఖచ్చితంగా పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఇందులో అలాంటి మంచి సింక్ కుదిరింది. రత్నవేలుతో పని చేయడం చాలా ఆనందంగా అనిపించింది. మంచి కోఆర్డినేషన్‌తో ఈ సినిమాకు వర్క్ చేశాం.
ఈ సినిమా ‘లగాన్’లా ఉండదు. ‘లగాన్’ బ్రిటిష్ కాలంలో జరిగిన కథ. ఇది 70-80 మధ్యలో విజయనగరం బ్యాక్‌డ్రాప్‌లో ఉండే కథ. మీరు క్రికెట్ చూస్తున్నప్పుడు మన ఊరిలో పొలాల గట్ల మీద కూర్చుని క్రికెట్ చూస్తే ఎలాంటి ఫీలింగ్ ఉంటుందో.. అంత నేచురల్ ఫీలింగ్ క్యారీ అవుతుంది. ఈ సినిమాకు ఏడాదికిపైగానే ప్రీ ప్రొడక్షన్ చేశాం. ఈ సినిమాకి వేసిన ప్రతి సెట్‌ను కూడా ఓపెన్ గ్రౌండ్‌లోనే వేశాం. అలాగే నేచురల్ లైట్‌లోనే తీశాం. ఇందులో ఒక హిల్ స్టేషన్ ఊరు కావాలి. అది హైదరాబాద్‌లోని ఒక బూత్ బంగ్లాలో వేశాం. మీరు సినిమా చూస్తున్నప్పుడు అది ఒక కొండ కింద ఉన్న ఊరిలా అనిపిస్తుంది. ఆ సెట్ వేయడం మాత్రం చాలా ఛాలెంజింగ్‌గా అనిపించింది. డైరెక్టర్ బుచ్చిబాబు, నేను మంచి కోఆర్డినేషన్‌తో వర్క్ చేశాం. ఇందులో చెరుకు ఫ్యాక్టరీ ఉంటుంది. అది కూడా సెట్. కాకపోతే అందులో బ్యూటీ ఏంటంటే మీరు ఒక్కటీ కూడా సెట్ అని పసిగట్టలేరు.
మొత్తంగా ‘పెద్ది’ కోసం స్క్రాచ్ నుంచి వేసిన సెట్స్ 24 ఉంటాయి. అలా కాకుండా సెటప్స్ అయితే దాదాపు 60-70 పైగానే ఉంటాయి. నార్మల్ సినిమా అయితే మనం ఎక్కడైనా షూట్ చేసుకోవచ్చు. ఇంత పెద్ద స్టార్ కాస్ట్‌తో వెళ్లి షూట్ చేయడం మామూలు విషయం కాదు. లోకేషన్స్ మన కంఫర్ట్‌లో పెట్టుకుంటేనే షూట్ చేయగలుగుతాం. విజయనగరం సెట్ వేసి దాదాపు ఏడాది అవుతుంది. ఎప్పుడంటే అప్పుడు షూట్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. అన్ని వెదర్ కండిషన్స్‌కు అనుకూలంగా ఉండేలా ఆ సెట్ వేసాం. ఇందులో హీరో వాడే బ్యాట్ కూడా చాలా నేచురల్ ప్రొడక్షన్ డిజైన్ నుంచి వచ్చింది. ఒక దేశీ ఆటగాడు తనకు దొరికే ముడిసరుకులతో బ్యాట్‌ని ఎలా తయారు చేసుకుంటాడో.. ఆ బ్యాట్ కూడా అంతే నేచురల్‌గా డిజైన్ చేశాం. అలాగే తనకు ఒక మేనరిజం ఉంటుంది. అవన్నీ కూడా అందులో రూపొందించడం జరిగింది.
ఇందులో నేను వేసిన ప్రతి సెట్‌ని చరణ్ అప్రిషియేట్ చేశారు. ట్రైన్ సెటప్, స్పెషల్ సాంగ్ సెట్, కుస్తీ... ఇలా ప్రతి సెట్ ఆయనకి ఎంతగానో నచ్చాయి. చరణ్‌ని కలవడానికి వచ్చిన చాలామంది కూడా సెట్స్ చాలా నేచురల్‌గా ఉన్నాయని చెప్పారు. యాక్షన్ సీక్వెన్స్ కుస్తీ సమయంలో చరణ్‌కు గాయమైంది అయింది. అలాంటి కండీషన్‌లో కూడా చరణ్ వెంటనే మళ్లీ షూటింగ్‌లోకి వచ్చారు. ఎందుకంటే ఆ నెల షూట్ చేయకపోతే ఆర్టిస్ట్ డేట్స్ అన్నీ మిస్ అయిపోతాయి. అందుకే మళ్లీ వెంటనే వచ్చి చేశారు. ‘పెద్ది’ కథ గురించి చెప్పాలంటే.. ఇది వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఫిల్మ్. థియేటర్ నుంచి బయటకు వచ్చినప్పుడు ఖచ్చితంగా కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి. ‘పెద్ది’ జర్నీతో ప్రతి ఒక్కరూ అంతలా ట్రావెల్ అవుతారు. కచ్చితంగా ఆ ఎమోషన్ అయితే ఉంటుంది. ‘పెద్ది’ కాకుండా నాని ‘ప్యారడైజ్’, మెగాస్టార్ సినిమాకు వర్క్ చేస్తున్నాను..’’ అని చెప్పుకొచ్చారు.
ఇవి కూడా చదవండి:
Lavanya Tripathi: ఇకపై ప్రెగ్నెంట్ అని తెలిస్తే.. ఆ పని చేయను
Peddi Movie: ‘పెద్ది’ విషయంలో బుచ్చిబాబు స్ట్రాటజీ ఏంటి? ఓన్లీ రామ్ చరణేనా!
‘సన్ రైజర్స్’కు సపోర్ట్ చేస్తున్న ఈ భామ ఎవరో గుర్తు పట్టారా?
Varanasi: ‘వారణాసి’కి వాటర్ కొరత!.. మహేష్ సినిమాకు ప్రభుత్వం షాక్!