Peddi Movie: రామ్ బుజ్జిగా దివ్యేందు శర్మ.. వీడియో వైరల్!

ABN , Publish Date - May 15 , 2026 | 10:01 PM

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘పెద్ది’తో బాక్సాఫీస్‌ వద్ద తుఫాన్ సృష్టించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్‌లో చరణ్ పవర్‌ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్ ఫుల్ ట్రీట్ ఇచ్చింది. ఇప్పుడీ సినిమాలోని పాత్రలను పరిచయం చేస్తున్నారు.

Divyendu Sharma in Peddi

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Mega Power Star Ram Charan) ‘పెద్ది’ (Peddi)తో బాక్సాఫీస్‌ వద్ద తుఫాన్ సృష్టించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్‌లో చరణ్ పవర్‌ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్ ఫుల్ ట్రీట్ ఇచ్చింది. సాంగ్స్ చార్ట్‌బస్టర్స్‌గా నిలిచి రికార్డులు క్రియేట్ చేశాయి. ప్రస్తుతం ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. షూటింగ్ పూర్తి చేసుకుని, పోస్ట్ ప్రొడక్షన్‌లో బిజీగా ఉండగా.. మరోవైపు ఈ చిత్రానికి పాన్ ఇండియా స్థాయిలో మ్యాసీవ్ ప్రమోషన్స్ ప్రారంభమయ్యాయి. బుచ్చిబాబు సానా (Buchi Babu Sana) దర్శకత్వంలో నిర్మాత వెంకట సతీష్ కిలారు వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రమోషన్స్‌లో భాగంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న థియేట్రికల్ ట్రైలర్‌ను మే 18న ముంబైలో గ్రాండ్ ఈవెంట్‌లో విడుదల చేయబోతున్నట్లుగా ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చేసింది.


ఈ ట్రైలర్ విడుదల లోపు.. రోజుకో ట్రీట్ అన్నట్లుగా మేకర్స్ సర్‌ప్రైజ్‌లు ఇస్తున్నారు. ఇప్పటికే చిత్రంలోని శివ రాజ్‌కుమార్ పాత్రను ‘గౌర్‌ నాయుడు’గా పరిచేయం చేసిన మేకర్స్ ఇప్పుడు మరో సర్‌ప్రైజ్ వదిలారు. ఈ చిత్రంలో మీర్జాపూర్ ఫేమ్ దివ్యేందు శర్మ (Divyendu Sharma) ఓ పవర్‌ఫుల్ పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో ఆయన పాత్రను ‘రామ్ బుజ్జి’ (Rambujji)గా పరిచయం చేస్తూ వీడియో రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాలీవుడ్ నుంచి కూడా ఈ వీడియోకు మంచి ఆదరణ లభిస్తుండటం విశేషం.


క్రికెట్ మైదానంలో రామ్ బుజ్జి ఎంట్రీ ఇచ్చిన తీరు, అతని బాడీ లాంగ్వేజ్, రగ్గడ్ యాటిట్యూడ్ పాత్రలోని ఇంటెన్సిటీని ఈ వీడియోలో బలంగా చూపించాయి. దివ్యేందు శర్మ స్క్రీన్ ప్రెజెన్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కలిసి వీడియోకి మాస్ వైబ్ తీసుకొస్తోంది. దీంతో ‘రామ్ బుజ్జి’ పాత్ర సినిమా కథలో ఎంత కీలకంగా ఉండబోతోందోనన్న ఆసక్తి ప్రేక్షకులలో మొదలైంది. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. శివ రాజ్‌కుమార్, జగపతిబాబు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ సమర్పిస్తున్నాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుపుకుంటోన్న ఈ చిత్రం జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలయ్యేందుకు ముస్తాబవుతోంది. జూన్ 3న ప్రీమియర్స్ పడనున్నాయి.

ఇవి కూడా చదవండి:

మోదీ ‘పొదుపు మంత్రం’.. కమల్ హాసన్ సంచలన ప్రకటన!

Varanasi: ‘వారణాసి’ కోసం మైత్రీ వేట.. టెంప్టింగ్ ఆఫర్‌!

Tom Cruise: తెలుగు యువ దర్శకుడితో టామ్ క్రూజ్ భారీ చిత్రం!

నిన్న ఆలీ.. నేడు రాజీవ్ కనకాల.. ఇలాంటి ఇబ్బందులు తప్పవు మరి!

Updated Date - May 15 , 2026 | 10:02 PM

Peddi Movie: కథ విని, 20 నిమిషాల పాటు మనిషిని కాలేకపోయా- ప్రొడక్షన్ డిజైనర్

Peddi Movie: ముంబైలో ట్రైలర్ లాంచ్.. ఆ వెంటనే భోపాల్‌లో.. ఆట మొదలైంది!

Peddi Movie: ‘పెద్ది’ కోసం ఎంఎస్ ధోని.. ఇది కదా న్యూస్ అంటే!

Peddi Movie: ‘పెద్ది’ ట్రైలర్‌కు డేట్ ఫిక్సయింది.. బుచ్చిబాబు ప్లాన్ ఇదే!

Peddi Movie: ‘పెద్ది’ విషయంలో బుచ్చిబాబు స్ట్రాటజీ ఏంటి? ఓన్లీ రామ్ చరణేనా!