Peddi Movie: ‘పెద్ది’ ట్రైలర్‌కు డేట్ ఫిక్సయింది.. బుచ్చిబాబు ప్లాన్ ఇదే!

ABN , Publish Date - May 11 , 2026 | 09:16 PM

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తోన్న రూరల్ యాక్షన్-స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొంది, విడుదలకు సిద్ధమవుతోన్న ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ డేట్‌ను మేకర్స్ ప్రకటించారు.

Peddi Trailer Update

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Mega Power Star Ram Charan) హీరోగా నటిస్తోన్న రూరల్ యాక్షన్-స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ (Peddi). బుచ్చిబాబు సానా (Buchi Babu Sana) దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు వచ్చిన ప్రమోషనల్ కంటెంట్‌తో, సినిమాపై ఆకాశమే అవధి అన్నట్లుగా అంచనాలున్నాయి. సినిమాకు సంబంధించిన అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో వేచి చూస్తు్న్నారు. ఇప్పటి వరకు రామ్ చరణ్ మినహా.. ఏ పాత్రను దర్శకుడు పరిచయం చేయలేదు. దీంతో బుచ్చిబాబు స్ట్రాటజీ ఏంటనేది ఎవరికీ అర్థం కాలేదు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను శరవేగంగా జరుపుకుంటోన్న ఈ చిత్రాన్ని జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ అధికారిక ప్రకటన విడుదల చేశారు.


ఈ ప్రకటన వచ్చినప్పటి నుంచి అభిమానులు, ఎప్పుడెప్పుడు ట్రైలర్ వదులుతారా? అని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అలా చూసే వారందరి కోసం మేకర్స్ ట్రైలర్ రిలీజ్ అప్డేట్‌ను సోమవారం అధికారికంగా ప్రకటించారు. రిలీజ్ కౌంట్‌డౌన్ ప్రారంభమవుతున్న తరుణంలో చిత్ర నిర్మాతలు ఇచ్చిన ఈ కీలక అప్డేట్‌తో ఒక్కసారిగా ‘పెద్ది’ సినిమా ట్యాగ్ ట్రెండ్‌లోకి వచ్చేసింది. అభిమానులు, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న థియేట్రికల్ ట్రైలర్‌ను మే 18న (Peddi Trailer Release Date) విడుదల చేయనున్నారు. ఇప్పటివరకు చరణ్ పాత్రలోని రెండు షేడ్స్ చూపించిన టీమ్, ట్రైలర్‌లో సినిమా అసలు కథను అలాగే ప్రధాన పాత్రలను రివీల్ చేయనున్నట్లు తెలుస్తోంది. ట్రైలర్‌లో చూపించాలనే, బుచ్చిబాబు ఇప్పటి వరకు చరణ్ మినహా ఎవరి పాత్రను రివీల్ చేయలేదనేలా టాక్ నడుస్తోంది. ట్రైలర్‌లో చాలా క్లారిటీగా ఇందులోని పాత్రలను రివీల్ చేయబోతున్నట్లుగా చిత్రయూనిట్‌లో టాక్ నడుస్తోంది.


ఇక ఈ ట్రైలర్ అప్డేట్‌తో పాటు మేకర్స్ వదిలిన కొత్త పోస్టర్‌లో రామ్ చరణ్ పూర్తి స్థాయి 1960ల గ్రామీణ యువకుడి లుక్‌లో రైల్వే ట్రాక్‌పై నడుస్తూ కనిపిస్తున్నారు. విజువల్స్‌లోని ప్రతి చిన్న డీటైలింగ్ ఆ కాలాన్ని ఎంతో సహజంగా, క్రియేటివ్‌గా రీక్రియేట్ చేశారో ఈ పోస్టర్ స్పష్టంగా చూపిస్తోంది. రామ్ చరణ్ పూర్తి స్థాయిలో రగ్గడ్ మేకోవర్‌తో ఇందులో కనిపించనున్నారు. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తోన్న ఈ సినిమా ఓవర్సీస్ ప్రీమియర్లు జూన్ 3న ప్రారంభం కానున్నాయి. ప్రత్యంగిర సినిమాస్ ద్వారా ఈ సినిమా ఓవర్సీస్‌లో రిలీజ్ కాబోతోంది. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, ఇతర కీలక పాత్రలలో శివ రాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ, బొమన్ ఇరానీ కనిపించనున్నారు.

ఇవి కూడా చదవండి:

తన తొలి సినిమా హీరో విజయ్‌ పై ప్రియాంక చోప్రా షాకింగ్ కామెంట్స్!

అవసరమే కానీ.. పెళ్లిపై ఫరియా అబ్దుల్లా ఆసక్తికర కామెంట్స్!

‘అండర్‌ రేటెడ్‌’ నటిగా చూస్తున్నారా? పాయల్ రాజ్‌ఫుత్‌ సమాధానమిదే!

Updated Date - May 11 , 2026 | 10:35 PM

Peddi Movie: ‘పెద్ది’ విషయంలో బుచ్చిబాబు స్ట్రాటజీ ఏంటి? ఓన్లీ రామ్ చరణేనా!

Peddi movie: మేకోవర్‌ మొదలైంది

Peddi Movie: కథ విని, 20 నిమిషాల పాటు మనిషిని కాలేకపోయా- ప్రొడక్షన్ డిజైనర్

Peddi Action Sequence:రామ్ చరణ్ 'పెద్ది' రిస్క్..

Peddi Song: ‘చికిరి’ పాట కోసం రెహమాన్‌ ఎవర్ని దింపారంటే..