ది ప్యారడైజ్ ఇంటర్వెల్‌లో.. సర్వపిండి
ABN, Publish Date - Sep 23 , 2026 | 10:58 AM
తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే సాంప్రదాయ వంటకం సర్వపిండి ఇప్పుడు ప్రేక్షకులను థియేటర్లలో కూడా పలకరించబోతోంది.
తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే సాంప్రదాయ వంటకం సర్వపిండి ఇప్పుడు ప్రేక్షకులను థియేటర్లలో కూడా పలకరించబోతోంది. ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించాలనే ఉద్దేశంతో మైత్రీ థియేటర్స్ (Mythri Theatres), మైత్రీ విమల్ (Mythri Vimal) మరియు మైత్రీ శివ గంగ (Mythri Shiva Ganga) థియేటర్లలో ఈ ప్రత్యేక వంటకాన్ని కొత్తగా అందుబాటులోకి తీసుకు వస్తోంది. ప్రత్యేకంగా ది ప్యారడైజ్ సినిమా ఇంటర్వెల్ సమయంలో సర్వపిండి ప్రేక్షకులకు అందించనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
ఒక చిన్న టిఫిన్ సెంటర్‌లో.. ఓ 77 ఏళ్ల బామ్మ (BaammaStories) చేతిలో తయారైన ఈ స్పెషల్ వంటకం ఇప్పుడు ప్రముఖ సింగిల్ స్క్రీన్ థియేటర్ల వరకు చేరుకోవడం విశేషం. ఈ తెలంగాణ సంప్రదాయ రుచిని వెండితెర సందడితో కలిపే ఈ ప్రయత్నం ప్రేక్షకులకు మరింత ప్రత్యేక అనుభవాన్ని అందించనుంది.