సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

2025 సినిమా, టీవీ నంది అవార్డుల నోటిఫికేషన్ విడుదల

ABN, Publish Date - Sep 23 , 2026 | 11:28 AM

ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న నంది చలనచిత్ర, టీవీ అవార్డులకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది.

nandi awards

ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న నంది చలనచిత్ర, టీవీ అవార్డులకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. 2012 నుంచి 2016 వరకూ.. 2017నుంచి 2024 వరకూ.. నంది ఫిల్మ్, టీవీ ఫిల్మ్ అవార్డులతో పాటు 2025 నంది అవార్డులు, 2012-16, 2025 సంవత్సరాల జాతీయ చలన చిత్ర అవార్డుల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. 2012-16 సంవత్సరాలకు సంబంధించిన నంది ఫిల్మ్, టీవీ ఫిల్మ్ అవార్డులను నవంబరులో విజయవాడలో ప్రత్యేక గెట్ టు గెదర్ ద్వారా అందజేయనున్నట్లు మంత్రి కందుల దుర్గేష్ (Kandula Durgesh) ఒక ప్రకటనలో తెలిపారు.

2017-24 సంవత్సరాలకు సంబంధించి ప్రతి ఏడాది ఉత్తమ చిత్రాలతో పాటు రెండు ప్రత్యేక జ్యూరీ ఆవార్డులు ఇవ్వనున్నట్లు చెప్పారు. 2025 నంది ఫిల్మ్, టీవీ అవార్డులతో పాటు జాతీయ చలనచిత్ర అవార్డుల నిర్వహణకు కూడా ప్రభుత్వం అనుమ తిచ్చింది. ఆవార్డుల ప్రదానోత్సవానికి అమరావతి, విజయవాడ వేదికలుగా ప్రతిపాదించిన ప్రభుత్వం నంది టీవీ అవార్డులకు తిరుపతిని ఎంపిక చేసింది. ఆవార్డుల ప్రకటన నవంబర్‌లో విడుదల చేసి ప్రధానోత్సవం నవంబర్, డిసెంబర్ నెలల్లో నిర్వహించనున్నారు.

నోటిఫికేషన్ విడుదల

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందించే నంది అవార్డులు-2025తో (Nandi Awards 2025) పాటు టీవీ చిత్ర నంది బహుమతులు-2025 కోసం దరఖాస్తుల ప్రక్రియను ప్రారంభించింది. తెలుగు సినీ, టెలివిజన్ రంగాలకు చెందిన నిర్మాతలు, దర్శకులు, కళాకారులు, సాంకేతిక నిపుణులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫిల్మ్, టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (APSFTVTDC) ఓ అధికారిక ప్ర‌క‌ట‌న‌లో వెల్లడించింది.

రాష్ట్ర ప్రభుత్వం తరఫున విడుదల చేసిన ప్రకటన ప్రకారం, 2025 సంవత్సరానికి విడుదలైన ఫీచర్ ఫిల్మ్స్, డబ్బింగ్ చిత్రాలు, బాలల చిత్రాలు, డాక్యుమెంటరీలు, విద్యాసంబంధిత చిత్రాలు సహా వివిధ విభాగాలకు నంది అవార్డులు ప్రదానం చేయనున్నారు. అలాగే టెలివిజన్ రంగంలో ప్రసారమైన కార్యక్రమాలు, టీవీ సీరియళ్లు, టెలిఫిల్మ్స్, టీవీ ఫీచర్స్, టీవీ మేగాసీరియళ్లు, టీవీ బాలల కార్యక్రమాలు, టీవీ డాక్యుమెంటరీ చిత్రాలు, సామాజిక అవగాహన కార్యక్రమాలు, ప్రత్యేక కార్యక్రమాలు కూడా ఈ అవార్డుల పరిధిలోకి రానున్నాయి.

దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు www.apsftvdc.in అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని, అక్టోబర్ 12, 2026 వరకు ఆన్‌లైన్‌లో అప్లై చేసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఆన్‌లైన్‌లో సమర్పించిన దరఖాస్తుల ప్రింట్ కాపీలను అవసరమైన పత్రాలతో కలిసి అక్టోబర్ 16, 2026లోపు విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర, టెలివిజన్ మరియు నాటకరంగ అభివృద్ధి సంస్థ కార్యాలయానికి పంపించాలని సూచించారు.


ఇవి కూడా.. చ‌ద‌వండి

OTT Movies: ఈ వారం.. ఓటీటీ సినిమాలు, వెబ్ సిరీస్‌ల జాబితా

థియేటర్లు ఊగిపోతయ్‌.. ఇది జడల్‌ గాని వాదా

'రాకా' సర్‌ప్రైజ్‌.. ఫ్యాన్స్‌ డిజప్పాయింట్?

కర్ణుడిగా రాఘవ లారెన్స్.. భారీ బడ్జెట్‌ పాన్ ఇండియా చిత్రం!

Nidhhi Agerwal: మంచి క‌థ, పాత్ర‌ల‌కు.. త‌మిళ సినీ రంగ‌మే ఉత్త‌మం

The Paradise: జ‌డ‌ల్‌.. సెన్సార్ క‌త్తెర‌కు బాగానే ప‌ని చెప్పాడుగా

ఆస్కార్‌ రేసులో మరో.. భార‌తీయ సినిమా

‘రా’ వ్యవస్థాపకుడి బయోపిక్

‘వారణాసి’ నుంచి బిగ్ లీక్..

Updated Date - Sep 23 , 2026 | 12:26 PM