సుమన్‌కు.. అక్కినేని పురస్కారం ప్రదానం
ABN , Publish Date - Sep 22 , 2026 | 12:30 PM
అక్కినేని నాగేశ్వరరావు జయంతి సందర్భంగా సినీనటుడు సుమన్ తల్వార్‌కు అక్కినేని పురస్కారం అందజేశారు.
తెలుగు చిత్ర పరిశ్రమ హైదరాబాద్ రావడానికి, పరిశ్రమ అభివృద్ధిలో అక్కినేని నాగేశ్వరరావు (Akkineni Nageswara Rao) ది ప్రముఖ పాత్ర అని రాష్ట్ర హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి రాధారాణి (Justice Radharani) గుర్తుచేశారు. ప్రముఖ సాంస్కృతిక సంస్థ అభినందన (Abhinandana Cultural Organization) ఆధ్వర్యంలో సోమవారం త్యాగరాయ గానసభలో (Sri Thyagaraya Gana Sabha) అక్కినేని జయంతి సందర్భంగా ప్రముఖ సినీనటుడు సుమన్ తల్వార్ (Suman Talwar) కు అక్కినేని పురస్కారం అందజేశారు.
అనంతరం జస్టిస్ రాధారాణి మాట్లాడుతూ.. అక్కినేని నటనలో కొత్త స్టెప్స్ ప్రవేశపెడితే, సుమన్ ఫైట్స్లో వైవిధ్యం చూపారన్నారు. ప్రముఖ సంపాదకుడు విజయబాబు మాట్లాడుతూ సుమన్ కూడా అక్కినేని నాగేశ్వరరావు మాదిరిగా క్రమశిక్షణ గల నటుడని అన్నారు. తొలుత జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కార్యక్రమంలో దర్శకుడు రేలంగి నరసింహారావు, వంశీ రామరాజు, అభినందన భవాని తదితరులు పాల్గొన్నారు.