సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Lilo Stitch OTT: ఓటీటీలో.. రికార్డులు బ‌ద్ద‌లు కొట్టిన రూ.9 వేల కోట్ల సినిమా! తెలుగులోనూ

ABN, Publish Date - Sep 04 , 2025 | 10:40 PM

మూడు నెల‌ల క్రితం విడుద‌లై సంచ‌ల‌నాల మీద సంచ‌ల‌నాలు సృష్టిస్తూ బాక్పాఫీస్‌ను షేక్ చేస్తోన్న హాలీవుడ్ సైన్స్ ఫిక్ష‌న్, అడ్వెంచ‌ర్ కామెడీ డ్రామా చిత్రం ‘లిలో & స్టిచ్’.

Lilo Stitch OTT

మూడు నెల‌ల క్రితం ప్ర‌పంచ వ్యాప్తంగా థియేట‌ర్ల‌లో విడుద‌లై ఇప్ప‌టికీ సంచ‌ల‌నాల మీద సంచ‌ల‌నాలు సృష్టిస్తూ బాక్పాఫీస్‌ను షేక్ చేస్తోన్న హాలీవుడ్ సైన్స్ ఫిక్ష‌న్, అడ్వెంచ‌ర్ కామెడీ డ్రామా చిత్రం ‘లిలో & స్టిచ్’ (Lilo & Stitch). సుమారు 100 మిలియ‌న్ డాల‌ర్లు అంటే మ‌న లెక్క‌ల ప్ర‌కారం రూ.835 కోట్ల రూపాయ‌ల‌తో నిర్మించిన‌ ఈ చిత్రం విడుద‌లైన ప్ర‌తి చోటా క‌లెక్ష‌న్ల సునామీ సృష్టించి పెట్టిన పెట్టుబ‌డికి ప‌దింత‌లు రాబ‌ట్టింది. దాదాపు రూ.8645 వేల కోట్ల‌ను సంపాదించి పెట్టి చ‌రిత్ర సృష్టించింది. ఈ యేడు హాలీవుడ్ హ‌య్య‌స్ట్ గ్రాస‌ర్ చిత్రాల్లో టాప్ 2గా నిలిచింది.

అలాంటి ఈ చిత్రం స‌డ‌న్‌గా ఎలాంటి ముంద‌స్తు ప్రక‌ట‌న లేకుండానే డైరెక్ట్ డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు వ‌చ్చి షాకిచ్చింది. వాల్ట్ డిస్నీ స్టూడియో (Walt Disney Studios) నిర్మించిన ఈ సినిమాకు డీన్ ఫ్లీషర్ క్యాంప్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా సిడ్నీ ఎలిజబెత్ అగుడాంగ్ (Sydney Elizebeth Agudong), బిల్లీ మాగ్నస్సేన్ (Billy Magnussen), హన్నా వాడింగ్‌హామ్ (Hannah Waddingham), క్రిస్ సాండర్స్ (Chris Sanders), కోర్ట్నీ బి. వాన్స్ (Courtney B. Vance) కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు.

క‌థ విష‌యానికి వ‌స్తే.. హవాయి బ్యాక్‌డ్రాప్‌లో నడిచే ఈ కథలో త‌ల్లిదండ్రులు లేని ఒంటరి అమ్మాయి లిలో అక్క నానితో క‌లిసి ఉంటుంది. ఒక రోజు ఓ పెట్ షాప్‌లో వింతగా కనిపించిన‌ స్టిచ్‌ని కుక్కపిల్ల అనుకుని దత్తత తీసుకుంటుంది. కానీ తీరా ఇంటికి వెళ్లాక అది చేసే అల్ల‌రికి అంతా తీవ్ర ఇబ్బందులు ప‌డుతారు. కొద్ది రోజుల‌కు అతి లిలోతో పూర్తిగా క‌లిసిపోయి ఓ ఫ్యామిలీ ఓ మెంబ‌ర్‌గా అయిపోతుంది. అయితే గెలాక్సీలోని ఓ గ్ర‌హంలో ఎలియ‌న్లు చేసిన ప్ర‌యోగంలో భాగంగా అది జ‌న్మించిద‌నే విష‌యం పోలీసుల ఎంక్వైరీ చేస్తున్న స‌మ‌యంలో బ‌య‌ట ప‌డుతుంది. ఈ క్ర‌మంలో అంత‌రిక్షం నుంచి వ‌చ్చిన స్పెష‌ల్ ఎలియ‌న్ టీం, మ‌రో వైపు పోలీసులు దాని కోసం వెలుకుతూ ఉంటారు. ఈ నేప‌థ్యంలో లిలో,స్టిచ్ ఏం చేశార‌నేదే క‌థ‌.

చెప్ప‌డానికి, విన‌డానికి చాలా సింపుల్‌గా అనిపిస్తున్న‌టికీ విజువ‌ల్‌గా ఈ చిత్రం చూస్తున్న‌ప్ప‌డు ప్ర‌తి ఒక్క‌రినీ ప్ర‌తీ స‌న్నివేశంలో మెస్మ‌రైజ్ చేస్తుంది. ఓ వూపు ఎమోష‌న‌ల్‌గా ట‌చ్ చేస్తూనే మ‌న మోములో చిరు న‌వ్వు అనేది మిస్ అవ‌కుండా ఆ క్యారెక్ట‌ర్‌తో పాటే ట్రావెల్ చేసే ఫీలింగ్ ఇస్తుంది. ఇప్పుడు ఈ సినిమా ఉన్న‌ఫ‌లంగా జియో హాట్ స్టార్ (Jio Hotstar) ఓటీటీ (Ott)లో ఇంగ్లీష్‌తో పాటు తెలుగు , త‌మిళ భాష‌ల్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ ‘లిలో & స్టిచ్’ (Lilo & Stitch) మూవీని రిలీజ్ స‌మ‌యంలో థియేట‌ర్ల‌లో మిస్స‌యిన వారు, మ‌రోసారి చూడాల‌నుకునే వారు ఇప్పుడు ఎంచ‌క్కా ఇంటిప‌ట్టునే చూసి అస్వాదించ‌వ‌చ్చు. ముఖ్యంగా పిల్ల‌ల‌కు ఈ చిత్రం ప‌ర‌మాన్నం లాంటిది. అస‌లు వ‌ద‌ల‌రు.పెద్ల‌కు కూడా న‌చ్చి తీరుతుంది. మ‌న‌కు ఖాళీ ఉన్న‌ప్పుడ‌ల్లా కుటుంబం అంతా క‌లిసి చూసి ఆస్వాదించే చిత్రం ఇది.


ఇవి కూడా.. చ‌ద‌వండి

A Minecraft Movie OTT: వేల కోట్లు కొల్ల‌గొట్టారు.. సైలెంట్‌గా ఓటీటీకి వ‌చ్చారు

Bun Butter Jam OTT: రిలీజైన.. వారానికే ఓటీటీకి వ‌చ్చేసిన రొమాంటిక్ కామెడీ

Coolie OTT: ర‌జ‌నీకాంత్‌కు త‌ప్ప‌లేదు.. నెల తిర‌క్కుండానే ఓటీటీకి

Nobody 2 OTT: రెండు వారాల‌కే.. ఓటీటీకి వ‌చ్చేసిన హాలీవుడ్ బ్లాక్‌బ‌స్ట‌ర్

Mouname Nee Bhaasha: మౌనమో నీభాష.. అంటున్న రాజీవ్ క‌న‌కాల

Nani Krithi Shetty: నాని, కృతి శెట్టి.. లిప్‌లాక్ సీన్‌! ఈ వివాదం.. ఇప్ప‌ట్లో చ‌ల్లారేనా

SSMB29 Leaks: మహేష్, రాజమౌళి.. SSMB29 నుంచి మ‌రో లీక్! ఈసారి వీడియో

Akhanda2: డిసెంబ‌ర్‌లో అఖండ‌2.. రిలీజ్ డేట్ చెప్పేసిన బాల‌య్య

Madharaasi Twitter Review: శివ కార్తికేయ‌న్ మ‌ద‌రాసి.. ట్విట్ట‌ర్ రివ్యూ! ఊహించ‌ని టాక్

Naga Durga: నాగ‌దుర్గ.. కొత్త పాటొచ్చేసింది! రంగుల సొక్కాను వేసి

Ghaati Review: అనుష్క ఘాటీ.. ట్విట్ట‌ర్ రివ్యూ! ఇలా అంటున్నారేంటి

Updated Date - Sep 05 , 2025 | 01:31 PM