Coolie OTT: రజనీకాంత్‌కు తప్పలేదు.. నెల తిరక్కుండానే ఓటీటీకి
ABN , Publish Date - Sep 04 , 2025 | 04:24 PM
ఎన్నో అంచనాల మధ్య ఆగస్టు15న భారీ ఎత్తున ప్రేక్షకుల ఎదుటకు వచ్చి తీవ్రంగా నిరాశ పర్చిన మల్టీస్టారర్ చిత్రం కూలీ.
సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) హీరోగా ఎన్నో అంచనాల మధ్య ఆగస్టు15న భారీ ఎత్తున ప్రేక్షకుల ఎదుటకు వచ్చి తీవ్రంగా నిరాశ పర్చిన మల్టీస్టారర్ చిత్రం కూలీ (Coolie). ఖైదీ,మాస్టర్, లియో వంటి భారీ విజయాల తర్వాత తమిళ అగ్ర దర్శకుడు లోకేశ్ కనగరాజ్ ఈ సినిమాను తెరకెక్కించారు. సన్ పిక్చర్స్ నిర్మించగా నాగార్జున (Nagarjuna), శృతి హాసన్ (Shruthi haasan), షౌబిన్ షాహీర్ (Soubin shahir) వంటి నటులు ప్రధాన పాత్రల్లో నటించగా అమీర్ ఖాన్, ఉపేంద్ర క్యామియో రోల్స్ లో కనిపించారు. అయితే ఇప్పుడీ చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్‌కు రెడీ అయింది. థియేటర్లకు వచ్చి నిండా నాలుగు వారాలు కాక మునుపే ఓటీటీ బాట పట్టడం అందరినీ ఆశ్యర్యానికి గురి చేస్తోంది.
కథ విషయానికి వస్తే.. విశాఖ పోర్టులో పని చేసే తన మిత్రుడు రాజశేఖర్ చనిపోయాడని తెలుసుకున్న దేవ దాని వెనక ఉన్న సీక్రెట్ తెలుసుకోవడానికి అక్కడికి వెళతాడు. తీరా అక్కడికి వెళ్లాక రాజశేఖర్ కూతురు దేవను దగ్గరికి రానివ్వదు. అయినా దేవ సొంతంగా ఇన్వెస్టిగేట్ చేస్తున్న క్రమంలో ఈ క్రైమ్ వెనకాల సైమన్, అతని కింద దయాల్ ఉన్నాడని అంతేగాక పోర్టులో కూలీలు వరుసగా చనిపోతున్నారని, హ్యుమన్ ఆర్గాన్ స్మగ్లింగ్ జరుగుతుందని తెలుసుకుంటాడు. ఈ నేపథ్యంలో దేవ వారి ఆట ఎలా కట్టించాడు, రాజశేఖర్ ముగ్గురి కూతుర్లలో ఉన్న తన కూమార్తెని కనిపెట్టాడా లేదా అన్నదే స్టోరి.
అయితే.. ప్రపంచ వ్యాప్తంగా రజనీ అభిమానులకు లోకేశ్ ఫ్యాన్స్ జత కలవడంతో సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటాయి. అంతేగాక లెకేశ్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్‌లో వస్తున్న సినిమా అంటూ ప్రచారం జరగడం కూడా ఈ సినిమాపై హైప్ పెరగడానికి ప్రధాన కారనమయ్యాయి. అయితే తీరా సినిమా విడుదల అనంతరం దీనికి ఎల్సీయూకు సంబంధమే లేదని తెలియడం, అంతేగాక సినిమాలో కథకథనాలు పరమ రోటిన్‌గా ఉండి సహనానికి పరీక్ష పెట్టడంతో పరాజయం బాట పట్టక తప్పలేదు. నాగార్జున పాత్ర తెలుగు వారిని బాగా డిస్సపాయింట్ చేసింది. సౌబిన్ చేసిన దయాల్ పాత్రే అసలు విలన్ అనేలా రూపొందించడం పెద్ద డ్రా బ్యాక్.
అయినప్పటికీ ప్రపంచవ్యాప్తగా రూ. 400 కోట్ల వరకు రాబట్టిన ఈ చిత్రం తెలుగులో మాత్రం పెట్టిన పెట్టుబడిని దక్కించుకుని ఫర్వాలేదనిపించుకుంది. ఇక ఇప్పుడు ఈ కూలీ (Coolie) సినిమా సెప్టెంబర్ 11 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) ఓటీటీలో తమిళంతో పాటు తెలుగు ఇతర ప్రముఖ భాషల్లోనూ స్ట్రీమింగ్ అవనుంది. థియేటర్లలో మిస్సయిన వారు, రజనీ ఫ్యాన్స్ మాత్రం ఒక్కసారి ఈ సినిమాను చూసే ప్రయత్నం చేయవచ్చు.