Nobody 2 OTT: రెండు వారాలకే.. ఓటీటీకి వచ్చేసిన హాలీవుడ్ బ్లాక్‌బస్టర్
ABN , Publish Date - Sep 03 , 2025 | 06:25 AM
బాబ్ ఓడెన్‌కిర్క్ , కోనీ నీల్సన్ నాలుగేండ్ల క్రితం విడుదలై సంచలన విజయం సాధించిన హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం నోబడీ.
బాబ్ ఓడెన్‌కిర్క్ (Bob Odenkirk), కోనీ నీల్సన్ (Connie Nielsen) నాలుగేండ్ల క్రితం విడుదలై సంచలన విజయం సాధించిన హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం నోబడీ (Nobody). ఇల్యా నైషుల్లర్ (Ilya Naishuller) దర్శకత్వంలో 2021లో వచ్చిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా భారీ విజయం సాధించడమే కాక యాక్షన్ సినిమాల్లో కొత్త ఒరవడిని సృష్టించింది. హై ఓల్టేజ్ యాక్షన్ చిత్రాల్లో ఇప్పటికీ టాప్ టెన్‌లో ఉండడం ఈ మూవీ ప్రత్యేకత. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్‌గా రూపొందించిన నోబడీ2 (Nobody 2) ఆగస్టు 15న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లకు వచ్చి మంచి ఆదరణనే దక్కించుకుంది. అయితే ఈ చిత్రం ఇప్పుడు నెల కూడా తిరగకుండానే డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది.
కథ విషయానికి వస్తే.. భార్య , పిల్లలతో కలిసి వెకేషన్‌కు వెళ్లిన హీరో అక్కడ కుటుంబంతో కలిసి సంతోషంగా గడుపుతుంటాడు. సరిగ్గా అదే సమయంలో హీరో పిల్లలు అనుకోకుండా చేసిన పని వళ్ల ఓ చిన్న ఘర్షణ కాస్త పెద్దగా మారి ఓ పెద్ద ధనవంతుని సామ్రాజ్యాన్ని నేలకూల్చే వరకు ఎలా వెల్లింది, తన ఫ్యామిలీని ఎలా రక్షించకున్నాడనే పాయింట్‌తో సినిమా మొదటి నుంచి చివరి వరకు మొత్తం మైండ్ బ్లోయింగ్ యాక్షన్ సన్నివేశాలతోనే సాగుతుంది. ఎక్కడా చిన్న విరామం ఇవ్వకుండా, బోర్ అనే మాట తెలీయకుండా మూవీ స్పీడుగా సాగిపోతూనే ఉంటుంది. కేవలం గంటా 29 నిమిషాల నిడివి మాత్రమే ఈ చిత్రం ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో రెంట్ పద్దతిలో అందుబాటులోకి వచ్చింది. అదీ కూడా బయటి దేశాలలో. మన దేశంలో మరో 10 రోజుల తర్వాత స్ట్రీమింగ్‌కు వచ్చే అవకాశం ఉంది.
అయితే ఆ లోపే ఈ చిత్రం ఇండియాలో పలు థర్డ్ పార్టీ యాప్స్, ప్రీ వెబ్‌సైట్లలో అల్రేడీ అందుబాటులోకి వచ్చింది. గతంలో హాలీవుడ్‌ల్‌లో హబ్స్ అండ్ షా, డెడ్ ఫూల్2, బుల్లెట్ ట్రైన్, ఆటోమిక్ బ్లాన్డే, ది ఫాల్‌గయ్ వంటి భారీ సినిమాలకు దర్శకత్వం చేసిన డైరెక్టర్ డేవిడ్ లించ్ (David Leitch) ఈ సినిమాను నిర్మించడం గమనార్హం. ఇక ప్రముఖ ఇండోనేషియా డైరెక్టర్ ది షాడో స్ట్రేస్ The Shadow Strays) వంటి హై ఓక్టేన్ యాక్షన్ చిత్రాలను డైరెక్ట్ చేసిన టిమో ట్జాజంటో (Timo Tjahjanto) దర్శకత్వం వహించాడు. అంతేగాక జాసన్ స్నాతమ్ ది బీ కీపర్2కు సైతం టిమోనే దర్శకుడు కావడం విశేషం. ఔట్ అండ్ ఔట్ యాఓన్ జాన్ విక్ తరహా యాక్షన్ సినిమా చూడాలనుకునే వారికి ఈ నోబడీ2 (Nobody 2) సినిమాను మించిన ఆప్సన్ లేదు.