Mouname Nee Bhaasha: మౌనమో నీభాష.. అంటున్న రాజీవ్ కనకాల
ABN , Publish Date - Sep 05 , 2025 | 08:48 AM
రాజీవ్ కనకాల, ప్రమోదిని మురుగన్, గాయత్రి భార్గవి ముఖ్యపాత్రల్లో నటించిన షార్ట్ ఫిలిమ్ ‘మౌనమో నీభాష’ .
రాజీవ్ కనకాల, ప్రమోదిని మురుగన్, గాయత్రి భార్గవి ప్రధాన పాత్రల్లో నటించిన హృద్యమైన షార్ట్ ఫిల్మ్ ‘మౌనమో నీభాష’ (Mouname Nee Bhaasha) త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. సుచేత డ్రీమ్ వర్క్స్, వర్మ డ్రీమ్ క్రియేషన్స్ పతాకాలపై రూపొందిన ఈ చిత్రం 30 నిమిషాల నిడివితో తెరకెక్కింది. దర్శకరచయిత వర ముళ్లపూడి (Vara Mullapudi) దర్శకత్వంలో నిర్మితమైన ఈ భావోద్వేగ కథనం సెప్టెంబర్ 7 నుంచి ఈటీవీ విన్ (ETV Win) ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది.
దర్శకుడు వర ముళ్లపూడి మాట్లాడుతూ – “మాటలు మౌనంలో కలిసినప్పుడు, మౌనంలో మనసు మునిగినప్పుడు, బాధలు మాటలకి అందనప్పుడు… ఆ మనసుకు మౌనమే భాష. ఆ భావనతోనే మా ఈ ‘మౌనమో నీభాష’ అని తెలిపారు. రాజీవ్ కనకాల తన అనుభవాన్ని పంచుకుంటూ ..ఎన్నో భావోద్వేగాల కలయికగా ఈ షార్ట్ ఫిల్మ్ రూపొందిందని, ప్రేక్షకులు ఎప్పుడెప్పుడు చూసి నన్ను, నా నటనను ఆదరిస్తారో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నా” అన్నారు.