Akhanda2: డిసెంబర్‌లో అఖండ2.. రిలీజ్ డేట్ చెప్పేసిన బాలయ్య
ABN , Publish Date - Sep 04 , 2025 | 07:06 PM
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం అఖండ2పై అంచనాలు ఏ రేంజ్‌లో ఉన్నాయో తెలిసిందే.
నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna), బోయపాటి శ్రీను (Boyapati Srinu) కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం అఖండ2 (Akhanda2) పై అంచనాలు ఏ రేంజ్‌లో ఉన్నాయో తెలిసిందే. అయితే ఈ సెప్టెంబర్ నెలలో దసరా పండుగను పురస్కరించుకుని ఈ చిత్రం రిలీజ్ కావాల్సి ఉంది. కానీ సినిమా విడుదలను వాయిదా వేస్తూ మేకర్స్ ఇటీవల ఓ ప్రకటన వెలవరించిన సంగతి తెలిసిందే. దీంతో అభిమానులు ఖంగుతిని తీవ్ర నిరాశ చెందారు. తిరిగి కొత్త విడుదల తేదీ ఎప్పుడనేది తెలియక అయోమయంలో ఉన్నారు.
పైగా ఈ చిత్రం సంక్రాంతి రేసులోకి వచ్చిందంటూ పుంఖాను పుంఖాలుగా వార్తలు వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ ఇచ్చాడు బాలయ్య. తన నియోజక వర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన అఖండ2 (Akhanda2)సినిమా గురించి పలు ఆసక్తికర అంశాలు అక్కడి ప్రజలతో పంచుకున్నాడు. నా అభిమానులు.. నా విజయాల్లోనే కాకుండా, నా అపజయాల్లో కూడా ఎప్పుడూ నా వెంట ఉన్నారు. వారు ఒక్కరే కాదు ప్రతి కులం, వర్గం, ప్రాంతం నుండి ఉన్నారు వారే నిజమైన అభిమానులు అంటూ ఎమోషనల్ అయ్యారు.
తమన్ (Thaman) వల్లే సినిమా వాయిదా పడిందని, ఇంకా చాలా టైం కావాలని అడిగాడని, అఖండ1కే స్పీకర్లు, ఊపర్లు బద్దలయ్యేలా సంగీతం ఇచ్చాడని, ఈ సారి దానికి 50 రెట్లు అఖండ2 ఉంటుందని ఇక మీ ఊహాకే వదిలేస్తున్నా అంటూ చెప్పుకొచ్చారు. ఇక అఖండ2 (Akhanda2) సినిమాను డిసెంబర్ ఫస్ట్ వీక్‌లో రిలీజ్ చేసేందుకు ఫ్లాన్ చేస్తున్నట్లు తెలిపాడు. త్వరలోనే డేట్ ప్రకటిస్తామని వెళ్లడించారు. ప్రస్తతుం బాలయ్య చేసిన ఈ ప్రకటనతో ఫ్యాన్స్‌లో కొత్త ఉత్సాహం మొదలైంది. ఇదిలాఉంటే అఖండ 1 సినిమా సైతం 2021లో డిసెంబ్2నే విడుదల కావడం గమనార్హం.