SSMB29 Leaks: మహేష్, రాజమౌళి.. SSMB29 నుంచి మరో లీక్! ఈసారి వీడియో
ABN , Publish Date - Sep 05 , 2025 | 07:27 AM
రాజమౌళి పాన్ వరల్డ్ ఒక గ్లోబ్‌ట్రాటింగ్ అడ్వెంచర్ మూవీ SMB29 షూట్ నుండి మహేష్‌బాబు తాజా పిక్చర్స్ లీక్ అయ్యాయి.
సూపర్‌స్టార్ మహేష్‌బాబు (Mahesh Babu), దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli) కాంబినేషన్‌లో వస్తున్న పాన్ వరల్డ్ ఒక గ్లోబ్‌ట్రాటింగ్ అడ్వెంచర్ మూవీ SSMB29. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం కెన్యాలో జరుగుతుండగా, అక్కడి నుంచి కొన్ని స్టిల్స్ లీక్ అయ్యాయి. గ్రీన్ టీషర్ట్ వేసుకున్న మహేష్‌బాబు మ్యాప్ పట్టుకొని కనిపించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయి షాకిచ్చాయి. అంతకుముందు ఒడిశా షెడ్యూల్‌లో మహేష్ లాంగ్ హెయిర్ లుక్ కూడా బయటికి రావడంతో అభిమానుల్లో హల్‌చల్ రేపింది.
రాజమౌళి టీమ్ చాలా కఠినమైన భద్రతా చర్యలు తీసుకుంటోంది. షూటింగ్ సెట్‌లో ఫోన్లను నిషేధించడం, వానిటీ వాన్స్‌ని దూరంగా పార్క్ చేయించడం వంటి జాగ్రత్తలు ఉన్నప్పటికీ, ఒక్కోసారి లీక్స్ బయటకు వస్తూనే ఉన్నాయి. దీని వల్ల మూవీ మేకర్స్ కొంత ఇబ్బందిపడుతున్నా, అభిమానులు మాత్రం సంతోషంగా ఈ లీక్స్‌ని షేర్ చేస్తున్నారు.
లీక్ అయిన ఫోటోలతో దట్టమైన అడవిలో, రగ్గడ్ లుక్‌లో మహేష్, మ్యాప్‌తో కనిపించడం, ఆఫ్రికా లొకేషన్లలో ఆయన స్థానికులతో మాట్లాడుతున్న ఫొటోలు కూడా వైరల్ అవడం ఫ్యాన్స్‌కు మంచి ఫీస్ట్ లా ఉంది. లీక్ అయిన ప్రతి స్టిల్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది.
"ఇంతకు ముందు ఎప్పుడూ లేని లుక్‌లో మహేష్", "రాజమౌళి మార్క్ యాక్షన్" అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఈ నవంబర్‌లో అధికారికంగా ఫస్ట్ లుక్, టీజర్ రిలీజ్ చేసి మార్చి 25 2027లో సినిమాను థియేటర్లకు తీసుకురానున్నట్లు సమాచారం.