Naga Durga: నాగదుర్గ.. కొత్త పాటొచ్చేసింది! రంగుల సొక్కాను వేసి
ABN , Publish Date - Sep 05 , 2025 | 09:12 AM
ఫోక్ సాంగ్స్ క్వీన్ నాగదుర్గ (Naga Durga) నటించి, నర్తించిన పాట మరోటి వచ్చేసింది.
జానపద గీతాల సంచలనం ఫోక్ సాంగ్స్ క్వీన్ నాగదుర్గ (Naga Durga) నటించి, నర్తించిన పాట మరోటి వచ్చేసింది. నెలకోటి చొప్పున వివిధ రకాల పాటలను రిలీజ్ చేస్తున్న వస్తున్న ఈ నటి ఆ పాటలు అలా ట్రెండింగ్‌లో ఉండగానే తాజాగా రంగుల సొక్కాను వేసి రయ్‌మని పోతున్నడే ఓ బావో రాముల.. ఫోజులు కొడుతున్నడే నా బావో రాముల (RANGULA SOKKA Full Song) అంటూ సాగే హుషారైన గీతంతో ప్రేక్షకులు, అభిమానుల ఎదుటకు వచ్చేసింది.
ఈ గీతానికి గుగులోతు వెంకన్న (Gugulothu Venkanna) సాహిత్యం అందించగా ఎస్కే బాజీ (Sk Baji) సంగీతంలో దివ్య మాలిక (Divya Malika) ఆలపించింది. టీనా నృత్య రీతులు సమకూర్చింది. ప్రముఖ ఆడియో కంపెపీ టీ సిరీస్ ఈ పాటను విడుదల చేయగా తక్కువ సమయంలోనే భాకీ వ్యూస్ దక్కించుకుంటోంది.