Ghaati Review: అనుష్క ఘాటీ.. ట్విట్టర్ రివ్యూ! ఇలా అంటున్నారేంటి
ABN , Publish Date - Sep 05 , 2025 | 06:34 AM
ఎన్నో అంచనాల మధ్య శుక్రవారం ప్రేక్షకుల ఎదుటకు వచ్చింది అనుష్క (Anushka Shetty) నటించిన ఘూటీ.
ఎన్నో అంచనాల మధ్య శుక్రవారం ప్రేక్షకుల ఎదుటకు వచ్చింది అనుష్క (Anushka Shetty) నటించిన ఘూటీ (Ghaati). దాదాపు ఐదు సంవత్సరాల తర్వాత క్రిష్ జాగర్ల మూడి (Krish Jagarlamudi ) దర్శకత్వంలో వచ్చిన సినిమా కావడంతో మూవీపై మంచి హైప్ ఏర్పడింది. ఆపై విడుదల చేసిన టీజర్, ట్రైలర్ , పాటలు, చేసిన ప్రమోషన్లు సైతం సినిమాలో సమ్‌థింగ్ ఏదో ఉంది అనేంతగా టాక్ వచ్చింది. ఈనేపథ్యంలో ఇప్సటికే చాలా ప్రాంతాలలో సినిమా షోలు పడిపోవడంతో అనేకమంది సినీ లవర్స్ సినిమాను వీక్షించి తమ అభిప్రాయాలను సోషల్ మీడియాలో పంచుకోవడం ప్రారంభించారు. ఈ క్రమంలో వారు ఎలా రెస్పాండ్ అయ్యారో, అవుతున్నారో క్లుప్తంగా ఇక్కడ తెలుసుకుందాం.
ఘాటీ సినిమా కోసం క్రిష్ తీసుకున్న కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉందని, చాలా సందర్భాల్లో విజిల్స్ వేసే సన్నివేశాలు ఉన్నాయని, అనుష్క సినిమాను అంతా సింగిల్ హ్యాండెడ్‌గా నడిపించిందని అంటున్నారు. అంధ్రా ,ఒరిస్సా సరిహద్దుల్లో తూర్పు కనుమల్లో చాలామంది ఒక టీంగా ఏర్పడి గంజాయి అక్రమ రవాణా చేస్తుంటారు. కొన్నాళ్లకు తాము చేసేది తప్పు అని తెలుసుకున్న వారు ఇక ఈ పని చేయొద్దని నిర్ణయించుకుంటారు. ఇతరులను కూడా మారుస్తుటారు. ఇది నచ్చని యాజమాన్యం వారిపై దాడులు చేస్తుంది ఈ క్రమంలో శీలావతి విక్టిమ్‌గా మారుతుంది. దీంతో ప్రతీకారం కోసం రంగంలోకి దిగిన శీలావతి క్రిమినల్‌గా మారడం చివరకు లెజండ్‌గా ఎలా అయిందనే కథనంతో సినిమా ఉన్నట్లు రివ్యూలు ఇస్తున్నారు.
అయితే ఔట్ అండ్ భారీ యాక్షన్ చిత్రంగా వచ్చిన ఈ సినిమాకు సంగీతం కాస్త మెరుగ్గా ఉంటే బాడుండేదని, తెలిసిన ప్టోరినే చూసినట్లు అనిపిస్తుందని అక్కడక్కడ బాగా లాగ్ చేశారని అంటున్నారు. సినిమాలో అనేక సబ్ ప్లాట్లు ఉండి ఓ యూనివర్స్ క్రియేట్ చేసేందుకు చేసిన ప్రయత్నంగా తెలుస్తుందని కానీ ఎగ్జిక్యూషన్ విషయంలో తడబడినట్లు పోస్టులు పెట్టారు. అంతేగాక క్రిష్ సినిమాలో ఉండే ఎమోషన్స్, డైలాగ్స్ మిస్సయ్యాయని కామెంట్లు చేస్తున్నారు. డ్రామా తక్కువగా పోరాట సన్నివేశాలే అధికంగా ఉంటూ బ్లడబాత్ చేయించారని, ఫస్టాఫ్ కన్నా సెకండాఫ్ మెరుగ్గా ఉందని, అనుష్క తర్వాత చైతన్య రావు క్యారెక్టర్ ఆకట్టుకునేలా ఉందని చెబుతున్నారు.
ఇదిలాఉంటే సినిమా ఎలా ఉందని వన్ సైడెడ్‌గా ఎవరూ చెప్పకపోయినా అనుష్క మాత్రం ఓ రేంజ్‌లో అలరిస్తుందని, చూపులతోనే కట్టి పడేస్తుందని కొనియాడుతున్నారు. మరి కొంతమందైతే ఏకంగా కాటేరమ్మ కోడలు, రెబల్ క్వీన్ అంటూ బిరుదులు సైతం ఇస్తున్నారు. ఈ చిత్రానికి ఓవర్సీస్ నుంచి కాస్త నిరాశ పరిచే రివ్యూలు వస్తుండగా ఇక్కడ మాత్రం ఫర్వాలేదు అనే టాక్ వస్తోంది. పుష్ఫ రేంజ్‌లో ఘూటీ (Ghaati) సినిమాను రా అండ్ రస్టిక్‌గా తీయాలని ప్రయత్నం చేశారు గానీ రీచ్ అవడం కష్టమని అంటున్నారు. చూడాలి ఈ రెండు రోజుల్లో ప్రేక్షకులు ఎలాంటి ఫలితం ఇస్తారో.