Madharaasi Twitter Review: శివ కార్తికేయ‌న్ మ‌ద‌రాసి.. ట్విట్ట‌ర్ రివ్యూ! ఊహించ‌ని టాక్‌

ABN , Publish Date - Sep 05 , 2025 | 10:15 AM

శివ కార్తికేయ‌న్, రుక్మిణీ వ‌సంత్ హీరోహీరోయున్లుగా విద్యుత్ జ‌మాల్‌, బీజు మీన‌న్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించిన నూత‌న చిత్రం మ‌ద‌రాసి

Madharaasi

శివ కార్తికేయ‌న్ (Sivakarthikeyan), రుక్మిణీ వ‌సంత్ (Rukmini Vasanth) హీరోహీరోయిన్లుగా విద్యుత్ జ‌మాల్‌, బీజు మీన‌న్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించిన నూత‌న చిత్రం మ‌ద‌రాసి (Madharaasi). సౌత్ అగ్ర ద‌ర్శ‌కుడు ముర‌గ‌దాస్ (ARMurugadoss) ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా అనిరుధ్ ర‌విచంద‌ర్ సంగీతం అందించాడు. చాలా అంచ‌నాల న‌డుమ‌ శుక్ర‌వారం ఈ చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా థియేట‌ర్ల‌లో రిలీజ్ అయింది. ఈ క్ర‌మంలో చాలామంది సినిమా చూసిన వారు వారి వారి శైలిలో సినిమాపై అభిప్రాయాల‌ను వ్య‌క్తం చేస్తూ మూవీ ఎలా ఉందో తెలిపారు, ఇంకా తెలుపుతూనే ఉన్నారు.

Madharaasi

ఇక సినిమా విషానికి వ‌స్తే.. త‌మిళ‌నాడులోని నార్త్ ఇండియా మాఫియా, స్థానిక పౌరుల మ‌ధ్య న‌డిచే క‌థ‌గా ఔట్ అండ్ ఔట్ యాక్ష‌న్ డ్రామాగా తెర‌కెక్కింది. సినిమా స్టార్ట్ అవ‌డ‌మే ఇంట్రెస్టింగ్ సెట‌ప్‌తో మొద‌లైనా ఆ త‌ర్వాత ల‌వ్ అంటూ రోమాంటిక్ ట్రాక్, ఆపై ఒక దాని త‌ర్వాత మ‌రోటి వ‌రుస‌బెట్టి పాట‌లు మూవీపై ఆస‌క్తి స‌న్న‌గిల్లేలా చేసిన‌ట్లు పోస్టులు పెడుతున్నారు. ఇక ఇంట‌ర్వెల్‌, క్లైమాక్స్ బ్యాంగులు బావున్నాయ‌ని, సినిమా కొన్ని సంద‌ర్భాల్లో సాగదీసిన‌ట్లు ఉంద‌ని, అన‌వ‌స‌ర స‌న్నివేశాలు ఎక్కువ‌గానే ఉన్నాయ‌ని చెబుతున్నారు.

Madharaasi

ముర‌గ‌దాస్ గ‌తంలో ఠాగూర్‌, గ‌జిని, స్టాలిన్ త‌ర‌హాలో మంచి క‌థ‌నే ఎంచుక‌న్నా తెర‌పైకి వ‌చ్చే సరికి అంత ఎఫెక్టివ్‌గా అనిపించ‌లేద‌ని, ఎక్క‌డో త‌డ‌బ‌డ్డ‌ట్టు తెలుస్తోంద‌ని అంటున్నారు. యాక్షన్ సీన్స్, ప్రొడక్షన్ వ్యాల్యూస్ సినిమాకు ప్లస్ అయున‌ప్ప‌టికీ అనిరుధ్ తీవ్రంగా నిరాశ ప‌రిచిన‌ట్లు పోస్టులు పెడుతున్నారు. సినిమా పూర్త‌య్యాక‌ స‌మ్‌థింగ్ ఏదో మిస్స‌యిన ఫీల్ మాత్రం వ‌స్తుంద‌ని, మొత్తంగా చూస్తే ముర‌గ‌దాస్ తుఫాకీ స్టైల్ త‌ర‌హాలో మెప్పించ‌లేక పోయింద‌ని, యాక్ష‌న్ సినిమాలు ఇష్ట‌ప‌డే వారికి ఇది మంచి ట్రీట్ ఇస్తుంద‌ని తేల్చేస్తున్నారు. మ‌రికొంత‌మంది సినిమా ఓ రేంజ్‌లో ఉంద‌ని ట్వీట్లు వేస్తున్న‌ప్ప‌టికీ అది ప‌రిమిత సంఖ్య‌లోనే ఉంది. ఇక‌ ఫైన‌ల్‌గా ఘాటీలానే ఈ సినిమా సైతం మిశ్ర‌మ స్పంద‌నే రాబ‌డుతోంది ఇక ఈ మ‌ద‌రాసి (Madharaasi) సినిమా భ‌విత‌వ్యం అంతా ప్రేక్ష‌కుల పైనే అధార ప‌డి ఉంది.


ఇవి కూడా.. చ‌ద‌వండి

A Minecraft Movie OTT: వేల కోట్లు కొల్ల‌గొట్టారు.. సైలెంట్‌గా ఓటీటీకి వ‌చ్చారు

Lilo Stitch OTT: ఓటీటీలో.. రికార్డులు బ‌ద్ద‌లు కొట్టిన రూ.9 వేల కోట్ల సినిమా! తెలుగులోనూ

Bun Butter Jam OTT: రిలీజైన.. వారానికే ఓటీటీకి వ‌చ్చేసిన రొమాంటిక్ కామెడీ

Coolie OTT: ర‌జ‌నీకాంత్‌కు త‌ప్ప‌లేదు.. నెల తిర‌క్కుండానే ఓటీటీకి

Nobody 2 OTT: రెండు వారాల‌కే.. ఓటీటీకి వ‌చ్చేసిన హాలీవుడ్ బ్లాక్‌బ‌స్ట‌ర్

Mouname Nee Bhaasha: మౌనమో నీభాష.. అంటున్న రాజీవ్ క‌న‌కాల

Nani Krithi Shetty: నాని, కృతి శెట్టి.. లిప్‌లాక్ సీన్‌! ఈ వివాదం.. ఇప్ప‌ట్లో చ‌ల్లారేనా

SSMB29 Leaks: మహేష్, రాజమౌళి.. SSMB29 నుంచి మ‌రో లీక్! ఈసారి వీడియో

Akhanda2: డిసెంబ‌ర్‌లో అఖండ‌2.. రిలీజ్ డేట్ చెప్పేసిన బాల‌య్య

Naga Durga: నాగ‌దుర్గ.. కొత్త పాటొచ్చేసింది! రంగుల సొక్కాను వేసి

Ghaati Review: అనుష్క ఘాటీ.. ట్విట్ట‌ర్ రివ్యూ! ఇలా అంటున్నారేంటి

Updated Date - Sep 05 , 2025 | 01:30 PM