A Minecraft Movie OTT: వేల కోట్లు కొల్లగొట్టారు.. సైలెంట్‌గా ఓటీటీకి వచ్చారు
ABN, Publish Date - Sep 05 , 2025 | 11:55 AM
సినీ లవర్స్‌ను అలరించేందుకు రీసెంట్ హాలీవుడ్ బ్లాక్ బస్టర్ ఫిలిం ఏ మైన్‌క్రాఫ్ట్ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ లవర్స్‌ను అలరించేందుకు రీసెంట్ హాలీవుడ్ బ్లాక్ బస్టర్ ఫిలిం ఏ మైన్‌క్రాఫ్ట్ మూవీ (A Minecraft Movie) డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. ఈ ఏడాది వేసవిలో ఏప్రిల్‌లో థియేటర్లకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డులు మీద రికార్డులు సృష్టించింది. అక్వామేన్ ఫేమ్ జాసన్ మోమోవా (Jason Momoa), జాక్ బ్లాక్ (Jack Black), డేనియల్ బ్రూక్స్ (Danielle Brooks), ఎమ్మా మైయర్స్ (Emma Myers), సెబాస్టియన్ హాన్సెన్ (Sebastian Hansen) కీలక పాత్రల్లో నటించగా జారెడ్ హెస్ (Jared Hess) దర్శకత్వం వహించాడు. అయితే థియేటర్ల వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించిన ఈ చిత్రం దానికి విరుద్దంగా చడీ చప్పుడు కాకుండా ఓటీటీలో స్ట్రీమింగ్‌కు వచ్చేసింది.
సేల్స్‌మాన్ అయిన స్టీవ్ తన డ్రీమ్ నెరవేర్చుకునేందుకు ఓ మైన్‌లోకి వెళతాడు. అక్కడ అతనికి ఒర్బ్ ఆఫ్ డామినెన్స్ మరియు ఎర్త్ క్రిస్టల్ దొరుకుతాయి. వాటితో ఓవర్‌వరల్డ్ అనే క్యూబ్స్‌తో నిండిన కొత్త ప్రపంచం ద్వారం తెరుస్తాడు. అదే సమయంలో నెదర్‌లోని పిగ్లిన్ రాణి మాల్గోషా ఈ శక్తిని తన వశం చేసుకోవాలని చూస్తుంది. అయితే అనుకోకుండా స్టీవ్ కుక్క డెనిస్ ఆ ఒర్బ్‌ని దాచేయడంతో మూలకు పడి పోతుంది. దాంతో స్టీవ్ ఆ ప్రంపంచంలోనే ఉండిపోతాడు.
కొన్ని సంవత్సరాల తర్వాత గ్యారెట్ అనే గేమ్ షాప్ యజమాని ఆ ఒర్బ్‌ని కనిపెడతాడు. దాంతో గ్యారెట్‌తో కలిసి హెన్రీ, నటాలీ అనే సోదరులు, వారి స్నేహితురాలు ఆ బ్లాక్స్ ప్రపంచంలోకి వెళ్తారు. అక్కడ స్టీవ్ వారిని కలుసుకొని క్రాఫ్టింగ్ నేర్పిస్తాడు. ఈ క్రమంలో పిగ్లిన్ ఆర్మీ దాడులు, గ్రేట్ హాగ్ రాక్షసుడు, వుడ్‌లాండ్ మాన్షన్‌లోని కొత్త క్రిస్టల్ కోసం జరిగే యుద్ధం ఇలా అనేక సాహాస పోరాటలతో కథ సాగుతుంది. చివరకు మాల్గోషా సైన్యాన్ని ఓడించారా, తిరిగి రియల్ లైఫ్ కి వచ్చారా లేదా అనే ఆసక్తికర కథనంతో సినిమా నడుస్తుంది.
ఇప్పుడీ సినిమా జియో హాట్‌స్టార్ (Jio Hotstar) ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుండగా కేవలం ఇంగ్లీష్, హిందీ భాషల్లో మాత్రమే అందుబాటులో ఉంది. థియేటర్లలో మిస్సయిన వారు, ముఖ్యంగా పిల్లలకు తెగ నచ్చే ఈ ఏ మైన్‌క్రాఫ్ట్ మూవీ (A Minecraft Movie) సినిమాను కుటుంబం అంతా కలిసి హాయిగా ఆస్వాదించవచ్చు. ఇదిలాఉంటే.. జన బాహుల్యంలో ఎంతో ప్రాచుర్యం పొందిన వీడియో గేమ్ ఆధారంగా ఈ మూవీ తెరకెక్కడం విశేషం. 150 మిలియన్ డాలర్లు అంటే రూ.1245 వేల కోట్లతో వ్యయంతో రూపొందించిన ఈ చిత్రం సుమారు 960 మిలియన్ డాలర్లు అంటే రూ.8 వేల కోట్లను రాబట్టి సంచలనం క్రియేట్ చేసింది.