scorecardresearch

మళ్లీ వస్తున్న హనుమాన్‌ జంక్షన్‌

ABN , Publish Date - Jun 17 , 2025 | 02:26 AM

అర్జున్‌, జగపతిబాబు, వేణు హీరోలుగా 2001లో వచ్చిన ‘హనుమాన్‌ జంక్షన్‌’ చిత్రం మళ్లీ ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తోంది...

మళ్లీ వస్తున్న హనుమాన్‌ జంక్షన్‌

అర్జున్‌, జగపతిబాబు, వేణు హీరోలుగా 2001లో వచ్చిన ‘హనుమాన్‌ జంక్షన్‌’ చిత్రం మళ్లీ ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఎడిటర్‌ మోహన్‌ నిర్మించిన ఈ చిత్రంతోనే ఆయన తనయుడు మోహన్‌ రాజా దర్శకుడిగా పరిచయమయ్యారు. లయ, స్నేహ, విజయలక్ష్మి హీరోయిన్లుగా నటించిన ‘హనుమాన్‌ జంక్షన్‌’ చిత్రాన్ని ఈ నెల 28న మళ్లీ థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. పూర్తి స్థాయి కామెడీ ఎంటర్‌టైనర్స్‌ తక్కువగా వస్తున్న ప్రస్తుత తరుణంలో ‘హనుమాన్‌ జంక్షన్‌’ మళ్లీ తన మ్యాజిక్‌తో మెస్మరైజ్‌ చేస్తుందని దర్శకనిర్మాతలు చెప్పారు.

Updated Date - Jun 17 , 2025 | 02:26 AM