Teaser And Glimpses Released: బర్త్‌డే స్పెషల్స్‌

ABN , Publish Date - Jul 29 , 2025 | 06:26 AM

మహానటి, సీతారామం, లక్కీ భాస్కర్‌ వంటి విజయవంతమైన చిత్రాలతో టాలీవుడ్‌లో ప్రత్యేక ఫ్యాన్స్‌ బేస్‌ని ఏర్పరచుకున్నారు..

‘మహానటి’, ‘సీతారామం’, ‘లక్కీ భాస్కర్‌’ వంటి విజయవంతమైన చిత్రాలతో టాలీవుడ్‌లో ప్రత్యేక ఫ్యాన్స్‌ బేస్‌ని ఏర్పరచుకున్నారు మలయాళ నటుడు దుల్కర్‌ సల్మాన్‌. ఇప్పుడు మరో రెండు చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించబోతున్నారు. సోమవారం దుల్కర్‌ సల్మాన్‌ పుట్టిన రోజు. ఈ సందర్భంగా మధ్యాహ్నం ‘కాంత’ చిత్రం నుంచి టీజర్‌, సాయంత్రం ‘ఆకాశంలో ఒక తార’ సినిమాకు సంబంధించిన గ్లింప్స్‌ విడుదలయ్యాయి. సెల్వమణి సెల్వరాజ్‌ తెరకెక్కిస్తోన్న ‘కాంత’ చిత్రాన్ని రానా దగ్గుబాటి, దుల్కర్‌ సల్మాన్‌, ప్రశాంత్‌ పొట్లూరి, జోమ్‌ వర్గీస్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దుల్కర్‌ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తున్నారు. 1950-60ల్లో ఓ హీరో, డైరెక్టర్‌ మధ్య ఘర్షణ నేపథ్యంలో దీన్ని రూపొందిస్తున్నారు. తెలుగు-తమిళంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా సెప్టెంబరు 12న విడుదల కానుంది. ఇక తెలుగు దర్శకుడు పవన్‌ సాధినేని తెరకెక్కిస్తోన్న ‘ఆకాశంలో ఒక తార’ చిత్రాన్ని గీతా ఆర్ట్స్‌, స్వప్న సినిమాస్‌ సంస్థలు నిర్మిస్తున్నాయి. జీవీ ప్రకాశ్‌ సంగీతం అందిస్తున్నారు. గ్లింప్స్‌లో దుల్కర్‌ని ఓ సాధారణ కుర్రాడిగా చూపించారు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ్‌, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో వెల్లడించనున్నట్లు చిత్రబృందం పేర్కొంది.

Also Read: Actress Ramya: నిన్ను అత్యాచారం చేసి చంపేస్తాం.. హీరో ఫ్యాన్స్ బెదిరింపులు

Also Read: Chaurya Paatham: మనీ హైస్ట్ ను తలపించే చోరీ.. ట్విస్టులకు దిమ్మ తిరగాల్సిందే

Updated Date - Jul 29 , 2025 | 06:26 AM