Sir Madam: ఒక్క రోజులో.. రెండు పాటలు వ‌దిలారు

ABN , Publish Date - Jul 29 , 2025 | 12:35 PM

విజ‌య్ సేతుప‌తి, నిత్యా మీన‌న్ జంట‌గా త‌మిళంలో రీసెంట్‌గా వ‌చ్చిన చిత్రం త‌లైవ‌న్ తలైవి సినిమాను స‌ర్ మేడ‌మ్ పేరుతో తెలుగులో రిలీజ్ చేస్తున్నారు.

Sir Madam

విజ‌య్ సేతుప‌తి (Vijay Sethupathi), నిత్యా మీన‌న్ (Nithya Menen) జంట‌గా త‌మిళంలో రీసెంట్‌గా వ‌చ్చిన చిత్రం త‌లైవ‌న్ తలైవి (Thalaivan Thalaivii). ఇప్పుడీ సినిమాను స‌ర్ మేడ‌మ్ (Sir Madam) అనే పేరుతో తెలుగులోకి అనువ‌దించి రిలీజ్ చేస్తున్నారు. గ‌త వార‌మే రిలీజ్ కావాల్సి ఉన్న ఈ సినిమా హారిహార వీర‌మ‌ల్లు రిలీజ్ నేప‌థ్యంలో వాయిదా వేసి ఆగ‌ష్టు1న థియేట‌ర్ల‌కు తీసుకు వ‌స్తున్నారు. ఈక్ర‌మంలో ఇప్ప‌టికే విడుద‌ల చేసిన టీజ‌ర్‌, ట్రైల‌ర్ సినిమాపై మంచి స్పంద‌న‌ను తీసుకు వ‌చ్చాయి.

ఈ నేప‌థ్యంలో.. తాజాగా ఈచిత్రం నుంచి గంట‌ల వ్య‌వ‌ధిలోనే రెండు పాట‌ల‌ను యూ ట్యూబ్ లో రిలీజ్ చేశారు. అందులో ఒక‌టి మెలోడీ కాగా, మ‌రోటి ఎమోష‌న‌ల్ సాంగ్‌. ఈ రెండు పాట‌ల‌కు రాంబాబు గోసాల (Rambabu Gosala) సాహిత్యం అందించ‌గా సంతోష్ నారాయ‌ణ‌న్ ( Santhosh Narayanan) సంగీతం అందించారు. మిఠాయి పొట్ల‌మే (Mitaayi Potlame) అంటూ సాగే పాట‌ను శ్రీధ‌ర్ ర‌మేశ్‌, ప‌విత్రా చారి ఆల‌పించ‌గా, క‌న్నా నీ చూపే ఊపిరిలే (Raave) అంటూ సాగే పాట‌ను శ‌ర‌త్ సంతోష్ (Sarath Santosh) ఆల‌పించాడు.

Updated Date - Jul 29 , 2025 | 12:35 PM