Arjun Chakravarthy: రియ‌ల్‌ స్పోర్ట్స్ డ్రామా స్టోరి.. అర్జున్ చ‌క్ర‌వ‌ర్తి టీజ‌ర్ అదిరింది

ABN , Publish Date - Jul 29 , 2025 | 06:46 AM

విజ‌య రామ‌రాజు, సిజ్జా రోజ్ జంట‌గా స్పోర్ట్స్ డ్రామాగా తెర‌కెక్కిన చిత్రం అర్జున్ చ‌క్ర‌వ‌ర్తి

Arjun Chakravarthy

విజ‌య రామ‌రాజు (Vijaya Rama Raju), సిజ్జా రోజ్ (Sijaa Rose) జంట‌గా స్పోర్ట్స్ డ్రామాగా తెర‌కెక్కిన చిత్రం అర్జున్ చ‌క్ర‌వ‌ర్తి ది సూప‌ర్ రైడ్ (Arjun Chakravarthy). ఓ క‌బ‌డ్డీ ప్లేయ‌ర్ నిజ జీవిత క‌థ ఆధారంగా తెర‌కెక్కిన ఈ చిత్రం అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుని విడుద‌ల‌కు రెడీ అవుతోంది. ఈ నేప‌థ్యంలో మేక‌ర్స్ తాజాగా సోమ‌వారం రాత్రి ఈ చిత్రం టీజ‌ర్ విడుద‌ల చేశారు.

టీజ‌ర్ చూస్తుంటే ప్రామిసింగ్ గా ఉండ‌గా ముఖ్యంగా డైలాగ్స్ మ‌రో లెవ‌ల్‌లో ఉండి సినిమాపై అంచ‌నాల‌ను క్రియేట్ చేస్తోంది. సుమారు తొమ్మిదేండ్లుగా నిర్మాణం చేసుకున్న ఈ సినిమాకు విక్రాంత్ రుద్ర (Vikrant Rudra) ర‌చించి ద‌ర్శ‌క‌త్వం చేయ‌గా విజ్ఞేష్ భాస్క‌ర‌న్ (Vignesh Baskaran) సంగీతం అందించాడు. ఇదిలాఉంటే ఇప్ప‌టికే ఈ చిత్రం 46 ఇంటర్నేషనల్ అవార్డ్స్ విన్నర్‌గా నిల‌వ‌డం విశేషం.

Updated Date - Jul 29 , 2025 | 06:57 AM