Kingdom: ర‌గిలే ర‌గిలే.. లిరిక‌ల్ వీడియో సాంగ్‌

ABN , Publish Date - Jul 29 , 2025 | 12:01 PM

జ‌య్ దేవ‌ర‌కొండ కింగ్డ‌మ్ నుంచి మంగ‌ళ‌వారం ర‌గిలే ర‌గిలే మొద‌ల‌య్యే యుద్దాలే అంటూ సాగే లిరిక‌ల్ వీడియో సాంగ్‌ను రిలీజ్ చేశారు.

Kingdom

విజ‌య్ దేవ‌ర‌కొండ (Vijay Deverakonda), భాగ్య శ్రీ భోర్సే (Bhagyashrii) జంట‌గా జ‌ర్సీ ఫేం గౌత‌మ్ తిన్న‌నూరి (Gowtam Tinnanuri)ద‌ర్శ‌క‌త్వంలో సితార ఎంట‌ర్ టైన్‌మెంట్స్ నిర్మాణంలో రూపొందిన చిత్రం కింగ్డ‌మ్‌. అనిరుద్ ర‌విచంద‌ర్ (Anirudh Ravichander) సంగీతం అందించాడు. ఇప్ప‌టికే ఈ చిత్రం నుంచి విడుద‌ల చేసిన పాట‌లు, టీజ‌ర్‌, ట్రైల‌ర్ సినిమాపై అంచ‌నాల‌ను రెట్టింపు చేసి ఓ రేంజ్‌లో నిల బెట్టాయి.

జూలై 31న ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ సినిమా ప్రేఓకుల ఎదుట‌కు రాబోతుంది. ఈ నేప‌థ్యంలో ఇటీవ‌ల తిరుప‌తి, హైద‌రాబాద్‌ల‌లో ప్ర‌త్యేక ఈవెంట్లు నిర్వ‌హించి సినిమాకు మ‌రింత బ‌జ్ తీస‌కు వ‌చ్చారు. కాగా తాజాగా మేక‌ర్స్ ఈ చిత్రం నుంచి ర‌గిలే ర‌గిలే అంటూ సాగే థీమ్ సాంగ్‌ను విడుద‌ల చేశారు. ఈ పాట‌కు కృష్ణ‌కాంత్ (Krishna Kanth) సాహిత్యం అందించ‌గా సిద్ధార్థ్ బ‌స్రూర్ (Siddarth Basrur) ఆల‌పించారు.

Updated Date - Jul 29 , 2025 | 12:01 PM