శ్రీశాంత్ విలన్‌గా యమధీర
ABN , Publish Date - Mar 17 , 2024 | 05:18 AM
కన్నడ ఇండస్ట్రీలోని ప్రముఖ నటుల్లో ఒకరైన కోమల్ కుమార్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘యమధీర’. ఇండియన్ క్రికెటర్ శ్రీశాంత్ ఇందులో నెగెటివ్ రోల్ పోషిస్తున్నారు...

కన్నడ ఇండస్ట్రీలోని ప్రముఖ నటుల్లో ఒకరైన కోమల్ కుమార్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘యమధీర’. ఇండియన్ క్రికెటర్ శ్రీశాంత్ ఇందులో నెగెటివ్ రోల్ పోషిస్తున్నారు. శంకర్ ఆర్ దర్శకత్వం వహిస్తున్నారు. వేదాల శ్రీనివాస్ నిర్మిస్తున్నారు. నాగబాబు, ఆలీ, సత్య ప్రకాష్, మధు సూధన్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ను ప్రముఖ నటుడు, ప్రొడ్యూసర్ అశోక్ కుమార్ లాంచ్ చేశారు. ఈ సందర్భంగా అశోక్ కుమార్ గారు మాట్లాడుతూ ‘‘శ్రీ మందిరం ప్రొడక్షన్స్‌లో తొలి చిత్రంగా వస్తున్న ‘యమధీర’ చాలా బాగా ఆడాలి. అలాగే మరెన్నో చిత్రాలు శ్రీ మందిరం ప్రొడక్షన్స్‌లో రావాలి. క్రికెటర్ శ్రీశాంత్ ఫాస్ట్ బౌలర్‌గా మైదానంలో చూపే దూకుడు ప్రతినాయకుడి పాత్రలో చూపించే అవకాశం ఉంది’’ అని అన్నారు. ప్రొడ్యూసర్ వేదాల శ్రీనివాస్ మాట్లాడుతూ ‘‘సినిమాల మీద ప్యాషన్ తో శ్రీమందిరం ప్రొడక్షన్స్ స్టార్ట్ చేశాను. ప్రేక్షకులు ఆదరిస్తారని కోరుకుంటున్నాను’’ అని అన్నారు. ఈ చిత్రానికి సంగీత దర్శకుడు:వరుణ్ ఉన్ని