అంగరంగ వైభవంగా అఖిల్‌ రిసెప్షన్‌

ABN , Publish Date - Jun 09 , 2025 | 04:36 AM

యువ కథానాయకుడు అఖిల్‌ అక్కినేని వివాహ రిసెప్షన్‌ అన్నపూర్ణ స్టూడియో్‌సలో ఆదివారం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి...

యువ కథానాయకుడు అఖిల్‌ అక్కినేని వివాహ రిసెప్షన్‌ అన్నపూర్ణ స్టూడియో్‌సలో ఆదివారం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హాజరయ్యారు. మహేశ్‌ బాబు, రామ్‌చరణ్‌ కుటుంబంతో సహా విచ్చేశారు. తమిళ హీరో సూర్యతోపాటు దర్శకుడు వెంకీ అట్లూరి హాజరయ్యారు. వీరితోపాటు పలువుురు సినీ సెలబ్రెటీలు కూడా సందడి చేశారు. ఈనెల 6న అఖిల్‌, జైనబ్‌ వివాహ బంధంతో కొత్త జీవితంలోకి అడుగుపెట్టారు.

Updated Date - Jun 09 , 2025 | 04:36 AM