సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

వీడీ, డైరెక్టర్ శౌర్యువ్ కాంబో ఫిల్మ్ స్పెషల్ పోస్టర్ వైరల్!

ABN, Publish Date - May 09 , 2026 | 10:34 PM

రౌడీ హీరో విజయ్ దేవరకొండ బర్త్‌డే స్పెషల్‌గా ఆయన నటిస్తోన్న సినిమా అప్డేట్స్ ఒక్కొక్కటిగా విడుదలయ్యాయి. ‘రౌడీ జనార్ధన’, ‘రణబాలి’ నుంచి వచ్చిన పోస్టర్స్ ఇప్పటికే వైరల్ అవుతుండగా.. తాజాగా మరో మూవీ నుంచి కూడా ఓ స్పెషల్ పోస్టర్‌ని మేకర్స్ వదిలారు.

Vijay Deverakonda-Shouryuv Film Poster

రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) బర్త్‌డే స్పెషల్‌గా ఆయన నటిస్తోన్న సినిమా అప్డేట్స్ ఒక్కొక్కటిగా విడుదలయ్యాయి. ‘రౌడీ జనార్ధన’, ‘రణబాలి’ నుంచి వచ్చిన పోస్టర్స్ ఇప్పటికే వైరల్ అవుతుండగా.. తాజాగా మరో మూవీ నుంచి కూడా ఓ స్పెషల్ పోస్టర్‌ని మేకర్స్ వదిలారు. విజయ్ దేవరకొండ హీరోగా వైరా క్రియేషన్స్ బ్యానర్‌పై శౌర్యువ్ (Shouryuv) దర్శకత్వంలో ప్రొడ్యూసర్ ప్రదీప్ ఉప్పలపాటి నిర్మిస్తోన్న చిత్రం నుంచి ఓ పవర్ ఫుల్ పోస్టర్‌ని మేకర్స్ విడుదల చేశారు. ఈ హ్యూజ్ గ్లోబల్ ప్రాజెక్ట్ ఇటీవలే ఘనంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. టాప్ ఇంటర్నేషల్ టెక్నీషియన్స్ ఈ మూవీకి వర్క్ చేస్తుండటం విశేషం.


విజయ్ దేవరకొండ పుట్టినరోజు శుభాకాంక్షలు (HBD Vijay Deverakonda) తెలియజేస్తూ వదిలిన ఈ పోస్టర్‌ ఆసక్తికరంగా ఉండటమే కాకుండా.. సినిమాపై భారీగా అంచనాలను పెంచేస్తోంది. మరీ ముఖ్యంగా.. ‘ప్రపంచం వ్యతిరేకించినా, విధి అతన్ని రాజును చేసింది..’ అని, పోస్టర్ పై ఉన్న క్యాప్షన్ క్యూరియాసిటీ క్రియేట్ చేస్తోంది. చేతిలో ఖడ్గంతో సింహాసనంపై కూర్చుని ఉన్న విజయ్ స్టిల్‌తో ఈ పోస్టర్‌ను డిజైన్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్‌ని ఫ్యాన్స్ విపరీతంగా వైరల్ చేస్తున్నారు. మా హీరోకి వరస బ్లాక్‌బస్టర్స్ పడబోతున్నాయంటూ సంబరాలు చేసుకుంటున్నారు.


ఇక ఈ సినిమాకు ‘హౌస్ ఆఫ్ ది డ్రాగన్, ఫాల్ ఔట్’ వంటి హాలీవుడ్ చిత్రాలకు పనిచేసిన అలెజాండ్రో మార్టినెజ్ డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ‘గాడ్స్ ఆఫ్ ఈజిప్ట్, బ్యాట్ మ్యాన్ ఫరెవర్, స్నోపియర్సర్’ చిత్రాల విఎఫ్ఎక్స్ సూపర్ వైజర్ ఎరిక్ డస్ట్ర్ ఈ మూవీకి పనిచేస్తున్నారు. ఇలా టాలెంటెడ్ టెక్నీషియన్స్ ఈ సినిమాకు పని చేస్తున్నట్లుగా మేకర్స్ ఇప్పటికే ప్రకటించి ఉన్నారు. మైథాలజికల్ యూనివర్స్ బ్యాక్ డ్రాప్‌లో రూపొందనున్న ఈ సినిమా.. ప్రేక్షకులకు ఒక కొత్త ప్రపంచాన్ని చూపించనుందని చిత్రబృందం చెబుతోంది.

ఇవి కూడా చదవండి:

Raghava Theater: ఈ థియేటర్‌లో ఫస్ట్, లాస్ట్ సినిమా ఎన్టీఆర్‌దే.. భావోద్వేగంలో ఫ్యాన్స్!

త్రిష లేకుంటే విజయ్ జాతకం మరోలా ఉండేది- వేణు స్వామి

Ranabaali: హార్స్ రైడింగ్ గ్లింప్స్.. విజయ్ ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్!

Rao Bahadur: ‘పెద్ది’తో పోటీకి మహేష్ బాబు ‘నో’.. రిలీజ్ డేట్ మారింది!

Updated Date - May 09 , 2026 | 10:34 PM