Ranabaali: హార్స్ రైడింగ్ గ్లింప్స్.. విజయ్ ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్!
ABN , Publish Date - May 09 , 2026 | 04:38 PM
హీరో విజయ్ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ ‘రణబాలి’ మూవీ నుంచి స్పెషల్ మేకింగ్ గ్లింప్స్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో గుర్రపు స్వారీ చేస్తూ విజయ్ కనిపించారు.
విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), రష్మిక మందన్న (Rashmika Mandanna) జంటగా నటిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘రణబాలి’ (Ranabaali). రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రాన్ని టీ సిరీస్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ హ్యూజ్ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. మే 9, హీరో విజయ్ దేవరకొండ పుట్టినరోజు (HBD Vijay Deverakonda) సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ ‘రణబాలి’ మూవీ నుంచి స్పెషల్ మేకింగ్ గ్లింప్స్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో ఈ సినిమా కోసం విజయ్ ఎంత కష్టపడుతున్నారో చూపించారు. రేర్ బ్రీడ్‌కు చెందిన గుర్రాన్ని స్వారీ చేయడానికి ఆయన ఎంతగా శిక్షణ తీసుకున్నారో, ఈ గ్లింప్స్ ద్వారా తెలియజేశారు. నిజంగా ఇది విజయ్ ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ అనే చెప్పుకోవాలి.
ఈ వీడియోను గమనిస్తే.. రణబాలి పాత్రలో విజయ్ దేవరకొండ హార్స్ రైడింగ్ కోసం ఎంతగా హార్డ్ వర్క్ చేస్తున్నారు, ఎలాంటి కఠినమైన ట్రైనింగ్ తీసుకున్నారనేది ఈ బర్త్‌డే గ్లింప్స్‌లో చూపించిన తీరుకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. స్టాలియన్ అనే గుర్రాలను స్వారీ చేయడం చాలా కష్టం. అలాంటి గుర్రాలపై స్వారీ చేయడానికి విజయ్ చాలా ప్రయత్నాలు చేశారు. ఎన్నో సార్లు పడిపోయినా, వెనుదిరగకుండా.. గాయాలకు తట్టుకుని సక్సెస్ ఫుల్‌గా హార్స్ రైడింగ్ చేయడం ఈ గ్లింప్స్‌లో ఆకట్టుకుంటోంది.
‘ఈ సీన్స్ స్క్రీన్ మీద చూసేందుకు చాలా బాగుంటాయి, అందుకే ఇలాంటి కష్టతరమైన సీన్స్ చేస్తున్నాను..’ అని విజయ్ చెప్పడం ఆయనకు సినిమా మీద ఉన్న ప్యాషన్ ఏంటో తెలియజేస్తోంది. ‘రణబాలి’ పాత్రలో విజయ్ చేసే హార్స్ రైడింగ్ సీన్స్, హార్స్‌తో పాటు చేసే భారీ యాక్షన్ సీక్వెన్సులు ఈ మూవీలో హైలైట్‌గా ఉంటాయని, విజయ్‌తో పాటు మేకర్స్ కూడా చెబుతున్నారు. 19వ సెంచరీ నేపథ్యంతో 1854 నుంచి 1878 మధ్య బ్రిటీష్ పాలనా కాలంలో జరిగిన యదార్థ చారిత్రక సంఘటనల ఆధారంగా రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమాను సెప్టెంబర్ 11న వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్‌కు తీసుకొచ్చేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
Rao Bahadur: ‘పెద్ది’తో పోటీకి మహేష్ బాబు ‘నో’.. రిలీజ్ డేట్ మారింది!
జబర్దస్త్ దొరబాబు కొత్త ఇల్లు చూశారా.. కళ్ళు జిగేల్ మనాల్సిందే!
తెలుగబ్బాయినే పెళ్లి చేసుకుంటా: పాయల్
Peddi Movie: కథ విని, 20 నిమిషాల పాటు మనిషిని కాలేకపోయా- ప్రొడక్షన్ డిజైనర్