Vijay Devarakonda Vs Rajashekhar: రౌడీ జ‌నార్దన్‌తో.. రాజ‌శేఖ‌ర్ ఢీ... కాంబినేష‌న్ అదిరింది...

ABN , Publish Date - May 14 , 2025 | 02:03 PM

టాలీవుడ్‌లో ప్ర‌స్తుతం ఓ ఆస‌క్తిక‌ర‌మైన వార్త నెట్టింట తెగ చ‌క్క‌ర్లు కొడుతుంది.

టాలీవుడ్‌లో ప్ర‌స్తుతం ఓ ఆస‌క్తిక‌ర‌మైన వార్త నెట్టింట తెగ చ‌క్క‌ర్లు కొడుతుంది. ప్ర‌స్తుతం విజ‌య్ దేవ‌ర‌కొండ (Vijay Deverakonda) వ‌రుస చిత్రాల‌తో య‌మ బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. వీటటిలో జ‌ర్సీ ఫేమ్ గౌత‌మ్ తిన్న‌నూరి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందించిన‌ కింగ్డ‌మ్ (Kingdom) చిత్రం విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వ‌గా ట్యాక్సీవాలా, శ్యామ్ సింగ‌రాయ్ ఫేం రాహుల్ సంకృత్యాన్ (Rahul Sankrityan) డైరెక్ష‌న్‌లో మైత్రీ బ్యాన‌ర్‌లో ఓ చిత్రం, శ్రీ వేంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు నిర్మాత‌గా రాజావారు రాణి వారు ఫేం ర‌వి కిర‌ణ్ (Ravi Kiran Kolla) కాంబోలో సినిమాలు షూటింగ్ ద‌శ‌లో ఉన్నాయి.

అయితే ర‌వి కిర‌ణ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొంద‌నున్న సినిమాకు రౌడీ జ‌నార్దన్ (Rowdy Janardhana) అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. కాగా ఈ మూవీలో ప్ర‌తి నాయ‌కుడి పాత్ర కోసం మ‌న‌ యాంగ్రీ ఎంగ్‌మెన్ డా. రాజ‌శేఖ‌ర్ (Rajasekhar) తో చ‌ర్చ‌లు జ‌రుపుతున్న‌ట్లు తెలుస్తోంది. ఈ విష‌య‌మై ఇప్ప‌టికే రాజ‌శేఖ‌ర్‌తో ఫొటో షూట్ సైతం చేసి ఫైన‌ల్ చేశార‌ని, ఆపై క‌ళ్లు చెదిరే రెమ్యున‌రేష‌న్ కూడా అందించ‌నున‌ట్లుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. అయితే రాజ‌శేఖ‌ర్‌కు ద‌శాబ్ద‌ కాలంగా విల‌న్ పాత్ర‌లు భారీగానే ఇంటి త‌లుపు త‌డుతున్నా ఆయ‌న అంగీక‌రించ‌డం లేదు. తెలుగులో చివ‌ర‌గా గ‌త సంవ‌త్స‌రం నితిన్ 'ఎక్ట్రార్డీన‌రీ మెన్' చిత్రంలో ఓ చిన్న పాత్ర‌లో కనిపించారు.

GquuGo8bwAAhchq.jpg

ఇదిలాఉంటే హీరో రాజ‌శేఖ‌ర్ (Rajasekhar) విష‌యంలో ఇలాంటి వార్త‌లు ఎప్ప‌టి నుంచో వినిపిస్తున్నాయి. బాల‌య్య సినిమాలో విల‌న్‌గా చేస్తున్నాడ‌ని, ఓ యంగ్ హీరో చిత్రంలో, ఉస్తాద్ రామ్ చిత్రంలో విల‌న్‌గా చేస్తున్నాడంటూ అనేక మార్లు కుప్ప‌లు కుప్ప‌లు వార్త‌లు వ‌చ్చాయి గానీ అందులో ఏదీ ఇప్ప‌టివ‌ర‌కు ముంద‌ర‌ ప‌డ‌లేదు. తాజాగా ఇప్పుడు ఈ విజ‌య్ దేవ‌రకొండ చిత్రంలోనైనా రాజ‌శేఖ‌ర్ (Rajasekhar) న‌టిస్తాడా అనేది కొద్ది రోజులు వెయిట్ చేస్తేనే గానీ తెలియ‌దు. అయితే చాలామంది ప్రేక్ష‌కులు ప్ర‌తినాయ‌కుడిగా న‌టించాల‌ని, ఆపై తిరిగి హీరోగా మ‌ళ్లీ బిజీ కావొచ్చు అంటూ హిత‌వు ప‌లుకుతున్నారు. అదేవిధంగా మ‌రో సీనియ‌ర్ న‌టుడు మోహ‌న్‌బాబు విష‌యంలోనూ ఇలాంటి వార్త‌లే వ‌చ్చాయి. నాని సినిమాలో విల‌న్‌గా చేస్తున్నాడంటూ న్యూస్ బ‌య‌ట‌కు వ‌చ్చింది గానీ ఇప్ప‌టి వ‌ర‌కు క్లారిటీ లేదు.

Updated Date - May 14 , 2025 | 02:38 PM