Rao Bahadur: ‘పెద్ది’తో పోటీకి మహేష్ బాబు ‘నో’.. రిలీజ్ డేట్ మారింది!

ABN , Publish Date - May 08 , 2026 | 09:50 PM

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’తో ఫైట్‌కు సూపర్ స్టార్ మహేష్ బాబు ‘నో’ చెప్పారు. అవును, ఇది నిజం. మహేష్ బాబు, రామ్ చరణ్‌ల మధ్య క్లాష్ ఏంటని అనుకుంటున్నారు కదా!

Mahesh Babu and Ram Charan

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Mega Power Star Ram Charan) నటించిన ‘పెద్ది’తో ఫైట్‌కు సూపర్ స్టార్ మహేష్ బాబు (Super Star Mahesh Babu) ‘నో’ చెప్పారు. అవును, ఇది నిజం. కన్ఫ్యూజ్ అవ్వవద్దు.. అసలు విషయం ఏమిటంటే.. వెర్సటైల్ యాక్టర్ సత్యదేవ్ హీరోగా సూపర్‌స్టార్ మహేష్ బాబు, నమ్రతా శిరోద్కర్‌‌లు తమ జిఎంబి ఎంటర్‌టైన్‌మెంట్‌లో ‘రావు బహదూర్’ (Rao Bahadur) అనే సినిమాను సమర్పిస్తోన్న విషయం తెలిసిందే. వెంకటేష్ మహా ఈ చిత్రానికి దర్శకత్వం వహించడమే కాకుండా కథ, ఎడిటింగ్ బాధ్యతలు కూడా నిర్వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఏ+ఎస్ మూవీస్, శ్రీచక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాను ఇంతకు ముందు జూన్ 5వ తేదీన విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించగా, ఇప్పుడు రిలీజ్ డేట్‌ను మార్చారు. అందుకు కారణం ‘పెద్ది’ సినిమానే.


బుచ్చిబాబు సానా (Buchi Babu Sana) దర్శకత్వంలో మోస్ట్ ఎవైటెడ్ రూరల్ స్పోర్ట్స్ డ్రామా‌గా రాబోతున్న ‘పెద్ది’ చిత్రం జూన్ 4వ తేదీన విడుదల కాబోతోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ప్రమోషన్స్ కూడా మొదలయ్యాయి. రెండు సార్లు రిలీజ్ విషయంలో వాయిదా పడిన ‘పెద్ది’, ఈసారి మాత్రం అందుకు ఛాన్స్ లేదనే క్లారిటీని మేకర్స్ కల్పిస్తున్నారు. దీంతో, సత్యదేవ్ ‘రావు బహదూర్’ సినిమాను జూలై 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఈ రిలీజ్ డేట్ పోస్టర్‌లో సత్యదేవ్ వయసు పైబడిన రాయల్ లుక్‌లో కనిపిస్తున్నారు. రాయల్ పర్పుల్ దుస్తులు, ముత్యాల అలంకరణలు, హ్యాండ్ ఫ్యాన్, వెనుక గ్రాండ్ సెటప్ కలిసి ఓ మిస్టీరియస్ అరిస్టోక్రాటిక్ ప్రపంచాన్ని సూచిస్తున్నాయి. పోస్టర్ మొత్తం సైకాలజికల్ డ్రామాకు తగ్గట్టుగా ఇంటెన్స్ వాతావరణాన్ని సృష్టిస్తోంది.


సత్యదేవ్ సరసన దీపా థామస్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. వికాస్ ముప్పాల, బాలా పరాశర్, ఆనంద్ భారతి, ప్రణయ్ వాక, మాస్టర్ కిరణ్ ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. రాయల్ విజువల్స్, మిస్టీరియస్ టోన్‌తో ‘రావు బహదూర్’ నెవర్ బిఫోర్ సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ అందించనుందని మేకర్స్ చెబుతున్నారు. ఈ సినిమాకు సంబంధించి మరిన్ని ఆసక్తికర అప్డేట్స్‌ను త్వరలోనే మేకర్స్ రిలీజ్ చేయనున్నారు. స్మరణ్ సాయి ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

జబర్దస్త్ దొరబాబు కొత్త ఇల్లు చూశారా.. కళ్ళు జిగేల్ మనాల్సిందే!

తెలుగబ్బాయినే పెళ్లి చేసుకుంటా: పాయల్

Peddi Movie: కథ విని, 20 నిమిషాల పాటు మనిషిని కాలేకపోయా- ప్రొడక్షన్ డిజైనర్

Lavanya Tripathi: ఇకపై ప్రెగ్నెంట్ అని తెలిస్తే.. ఆ పని చేయను

Updated Date - May 08 , 2026 | 09:50 PM

Peddi Action Sequence:రామ్ చరణ్ 'పెద్ది' రిస్క్..

Peddi First Shot: రామ్ చరణ్ చెప్పినట్టే ఫస్ట్ షాట్ అదిరింది

Peddi Movie: కథ విని, 20 నిమిషాల పాటు మనిషిని కాలేకపోయా- ప్రొడక్షన్ డిజైనర్

Rao Bahadur Satya Dev: ఇదెక్క‌డి షాక్‌రా మామ.. ఇది అస‌లు ఊహించ‌లే! రావుబహదూర్‌గా స‌త్య‌దేవ్

Rao Bahadur: స‌త్య‌దేవ్‌.. ‘రావుబహదూర్‌’ టీజ‌ర్ ఈ రేంజ్‌లో ఉందేంటి