Vijay Devarakonda: ఏ నా కొడుకు మనల్ని ఆపేదేలే.. పుష్ప రేంజ్ లో విజయ్ సవాల్

ABN , Publish Date - Jul 26 , 2025 | 09:54 PM

రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) ఈసారి ఎలాగైనా కింగ్డమ్ తో మంచి విజయాన్ని అందుకోవాలని చూస్తున్నాడు. కొన్నేళ్లుగా ఒక్క హిట్ కూడా అందుకోలేకపోయాడు.

Vijay Devarakonda

Vijay Devarakonda: రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) ఈసారి ఎలాగైనా కింగ్డమ్ తో మంచి విజయాన్ని అందుకోవాలని చూస్తున్నాడు. కొన్నేళ్లుగా ఒక్క హిట్ కూడా అందుకోలేకపోయాడు. దీనివలన విజయ్ ప్రవర్తనలో చాలా మార్పులు వచ్చాయి. ఈసారి కనుక హిట్ కొడితే.. ఇక వెనక్కి తగ్గేది లేదు అని గట్టిగానే చెప్పుకొస్తున్నాడు. ప్రస్తుతం విజయ్ ఆశలన్నీ కింగ్డమ్ (Kingdom) మీదనే పెట్టుకున్నాడు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని నాగవంశీ నిర్మించాడు. ఈ చిత్రంలో విజయ్ సరసన భాగ్యశ్రీ బోర్సే నటించింది.


ఇప్పటికే కింగ్డమ్ నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడంతో పాటు సినిమాపై హైప్ ను క్రియేట్ చేశాయి. ఇక నేడు ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ వేడుక తిరుమలలో నిర్వహించారు. ఈ వేడుకలో ట్రైలర్ ఏమో కానీ, విజయ్ స్పీచ్ మాత్రం సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. అంతలా ఏం మాట్లాడాడు అని అంటే.. అంతలా ఏం మాట్లాడలేదు.. పుష్పలా మాట్లాడాడు. అదేనండీ.. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ మాట్లాడిన చిత్తూరు యాసలో అదరగొట్టేశాడు.


'హల్లో తిరుపతి.. ఏం యెట్లా ఉన్నారు అందరూ.. బావుండరా. బావుండాలి. అందరూ బావుండాలి. అందరం బావుండాలి. ఈ తూరు నేరుగా మీకాడికే వచ్చినాం. మీ అందరినీ కలిసినాము. ట్రైలర్ లేట్ అయినాది. అయినా మీ అందరితో పాటు ట్రైలర్ చూసినాము. మీ అరుపులు, కేకలు వింటాంటే చానా అంటే చానా సంతోషంగా ఉంది. గతేడాది నుంచి కింగ్డమ్ సినిమా గురించి ఆలోచిస్తాంటే.. నా తలకాయలో ఒకటే తిరుగుతాంది. నా మనసులో గట్టిగా ఒకటే అనిపిస్తాంది. మన తిరుపతి ఏడుకొండల వెంకన్న సామీ కానీ, ఈ ఒక్కసారి నా వెనుక ఉండి నడిపించినాడో.. సానా పెద్దోడినై పూడుస్తా సామీ.. వెళ్లి టాప్ లో పోయి కూర్చుంటా. ఎందుకంటే ఎప్పటిలానే నా సినిమా కోసం నేను చానా కష్టపడి పనిచేసినా.. ఈసారి నా సినిమాను చూసుకోవడానికి చానా మంచి మంచోళ్ళే ఉన్నారు.


మా డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి ఉన్నాడు. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ ఉన్నాడు. ఎడిటర్ నవీన్ నూలి ఉన్నాడు. మా ప్రొడ్యూసర్ నాగవంశీ ఉన్నాడు. మా కొత్తపాప భాగ్యశ్రీ ఉంది. అందరం ఇప్పటికీ కష్టపడుతూనే ఉన్నాం. ఇక మిగిలినవి రెండే. ఆ వెంకన్న దయ.. మీ ఆశీస్సులు. ఈ రెండు ఉంటే.. నన్ను ఆపేది ఎవరు లేరు. నాలుగురోజుల్లో ప్రేక్షకులను థియేటర్లో కలుస్తున్నా.. అప్పటివరకు మమ్మల్ని చూసుకో సామీ' అంటూ ముగించాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

Sunday Tv Movies: ఆదివారం, జూలై 27న.. తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలివే

Deviyani Sharma: అందాలను ఈ రేంజ్ లో ఆరబోస్తున్నా పట్టించుకోరేంటయ్యా

Updated Date - Jul 26 , 2025 | 09:58 PM