ఇదైనా ప‌క్కానా.. మ‌ళ్లీ మారుతుందా 'వెంకీమామ‌'

ABN , Publish Date - Sep 23 , 2026 | 02:34 PM

సినీ ఇండస్ట్రీలో ఒక భారీ ప్రాజెక్ట్ మొదలైనప్పుడు రిలీజ్ డేట్ ప్రకటించడం ఎంత సహజమో, సరిగ్గా అదే తేదీకి థియేటర్లలోకి రావడం అంతకంటే పెద్ద అద్భుతం.

Aadarsha Kutumbam

సినీ ఇండస్ట్రీలో ఒక భారీ ప్రాజెక్ట్ మొదలైనప్పుడు రిలీజ్ డేట్ ప్రకటించడం ఎంత సహజమో, సరిగ్గా అదే తేదీకి థియేటర్లలోకి రావడం అంతకంటే పెద్ద అద్భుతం. నటీనటుల కాల్షీట్లు, పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఆలస్యం.. ఇలా ఒక్కటేమిటి, ఎన్నో లెక్కలు తారుమారై రిలీజ్ డేట్లు వాయిదా పడటం టాలీవుడ్‌లో సర్వసాధారణం అయిపోయింది. ఇప్పుడు ఇదే బాటలో విక్టరీ వెంకటేశ్ (Venkatesh), మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) కాంబోలో రూపుదిద్దుకుంటున్న మోస్ట్ అవైటెడ్ మూవీ చేరింది. అదే ‘ఆదర్శ కుటుంబం’ (Aadarsha Kutumbam).

ఈ సినిమా విడుదల తేదీ మారినట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. నిజానికి ఈ చిత్రాన్ని ముందుగా గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న థియేటర్లలోకి తీసుకురానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే ఇప్పుడు ఆ తేదీని వాయిదా వేశారు. ముందుగా ప్రకటించిన తేదీ కంటే వారం రోజులు ఆలస్యంగా, అంటే అక్టోబర్ 9న ప్రపంచవ్యాప్తంగా ‘ఆదర్శ కుటుంబం’ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ వెల్లడించింది. దీనితో వెంకీ ఫ్యాన్స్ కాస్త నిరాశ చెందినా, మూవీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

HS0iTjqaEAAkqDA.jfif

సినీ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమా వాయిదా వెనుక పలు కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది. క్వాలిటీ విషయంలో చిత్ర యూనిట్ ఎక్కడా రాజీ పడటానికి సిద్ధంగా లేదు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నా, సాంకేతిక ప్రమాణాల్లో మరింత పరిపూర్ణత తేవాలని దర్శకుడు త్రివిక్రమ్ భావిస్తున్నారట. దీనికి తోడు ఇంకా కాస్త షూటింగ్ భాగం కూడా మిగిలి ఉన్నట్లు తెలుస్తోంది. ప్రేక్షకులు థియేటర్‌కు వచ్చినప్పుడు సాంకేతికంగా అత్యుత్తమ స్థాయి వినోదాన్ని అనుభవించాలనే ఉద్దేశంతోనే ఈ స్వల్ప వాయిదా నిర్ణయం తీసుకున్నారు. ఇంకో వైపు క్టోబర్ 9న సినిమాను రిలీజ్ చేయడం వల్ల దసరా పండుగ సెలవులను పూర్తిస్థాయిలో క్యాష్ చేసుకోవచ్చనేది నిర్మాతల ఆలోచనట. పండుగ వాతావరణంలో ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు పోటెత్తే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

ఇక విక్టరీ వెంకటేశ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ కు టాలీవుడ్‌లో ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. గతంలో వెంకటేశ్ హీరోగా వచ్చిన ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’ చిత్రాలకు త్రివిక్రమ్ రచయితగా అందించిన మాటలు ఎలాంటి సంచలనం సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ సినిమాల్లోని డైలాగులు, హాస్య సన్నివేశాలు ఇప్పటికీ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూనే ఉన్నాయి. టీవీల్లో ఆ సినిమాలు వస్తే ఇప్పటికీ రిమోట్ పక్కనపెట్టి చూసే అభిమానులు కోట్లలో ఉన్నారు.

అయితే, ఇప్పటివరకు త్రివిక్రమ్ కేవలం రచయితగానే వెంకటేశ్ తో కలిసి పనిచేశారు. తొలిసారి దర్శకుడిగా వెంకటేశ్ ను ఆయన డైరెక్ట్ చేస్తుండటంతో అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఫ్యామిలీ ఆడియన్స్‌కు నచ్చే కథలకు తనదైన పంచ్ డైలాగ్స్, ఎమోషనల్ డెప్త్ జోడించడంలో త్రివిక్రమ్‌ దిట్ట. వెంకీ మార్క్ టైమింగ్, త్రివిక్రమ్ మార్క్ పెన్ పవర్ కలిస్తే థియేటర్లలో నవ్వుల జాతర ఖాయమని ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, టీజర్, సరికొత్త పోస్టర్లు ఆ అంచనాలను రెట్టింపు చేశాయి.

ఇందులో వెంకటేశ్ సరసన శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. మరోవైపు కీలక పాత్రల్లో నివేదా పేతురాజ్, నారా రోహిత్ కనిపించనుండటం సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది. దీంతో వారం ఆలస్యంగా రావడం అనేది బిజినెస్ పరంగా, కంటెంట్ క్వాలిటీ పరంగా సినిమాకు మరింత ప్లస్ అవుతుందనే టాక్ బలంగా ఉంది. మరి అక్టోబర్ 9న దసరా బరిలో దిగుతున్న ‘ఆదర్శ కుటుంబం’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తుందో చూడాలి.


ఇవి కూడా.. చ‌ద‌వండి

OTT Movies: ఈ వారం.. ఓటీటీ సినిమాలు, వెబ్ సిరీస్‌ల జాబితా

థియేటర్లు ఊగిపోతయ్‌.. ఇది జడల్‌ గాని వాదా

'రాకా' సర్‌ప్రైజ్‌.. ఫ్యాన్స్‌ డిజప్పాయింట్?

కర్ణుడిగా రాఘవ లారెన్స్.. భారీ బడ్జెట్‌ పాన్ ఇండియా చిత్రం!

Nidhhi Agerwal: మంచి క‌థ, పాత్ర‌ల‌కు.. త‌మిళ సినీ రంగ‌మే ఉత్త‌మం

The Paradise: జ‌డ‌ల్‌.. సెన్సార్ క‌త్తెర‌కు బాగానే ప‌ని చెప్పాడుగా

ఆస్కార్‌ రేసులో మరో.. భార‌తీయ సినిమా

‘రా’ వ్యవస్థాపకుడి బయోపిక్

‘వారణాసి’ నుంచి బిగ్ లీక్..

Updated Date - Sep 23 , 2026 | 03:36 PM