రవితేజ ‘ఇరుముడి’లో సీనియర్ నటి.. ఎవరో తెలుసా?
ABN, Publish Date - Apr 12 , 2026 | 09:18 PM
మాస్ మహారాజా రవితేజ హీరోగా, శివ నిర్వాణ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘ఇరుముడి’. ఇప్పటి వరకు రవితేజ పోషించని ఓ వైవిధ్యభరితమైన పాత్రని ఇందులో చేస్తున్నట్లుగా ఇప్పటికే వచ్చిన పోస్టర్స్ తెలియజేస్తున్నాయి.
మాస్ మహారాజా రవితేజ (Mass Maharaja Ravi Teja) హీరోగా, శివ నిర్వాణ (Shiva Nirvana) దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘ఇరుముడి’ (Irumudi). ఇప్పటి వరకు రవితేజ పోషించని ఓ వైవిధ్యభరితమైన పాత్రని ఇందులో చేస్తున్నట్లుగా ఇప్పటికే వచ్చిన పోస్టర్స్ తెలియజేస్తున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) భారీ స్థాయిలో నిర్మిస్తోన్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పుడో వార్త బాగా వైరల్ అవుతోంది. ఈ సినిమాలో 90స్ స్టార్ హీరోయిన్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. ఆ సీనియర్ నటి మరెవరో కాదు.. ‘రుద్రవీణ, అభినందన, నారీ నారీ నడుమ మురారి, రౌడీ అల్లుడు’ వంటి ఎన్నో చిత్రాలలో నటించిన స్టార్ హీరోయిన్ శోభన (Shobana). చాలా గ్యాప్ తర్వాత ఆమె ప్రభాస్ హీరోగా వచ్చిన ‘కల్కి 2898 AD’ చిత్రంలో ఓ కీలక పాత్రలో నటించారు. ఇటీవల ఆమె రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమాలో కూడా ఓ రోల్ చేస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి కానీ, అధికారిక ప్రకటన మాత్రం ఇంత వరకు రాలేదు.
ఇప్పుడు మరో స్టార్ హీరో అయినటువంటి రవితేజ చిత్రంలో ఆమె ఓ కీలక పాత్రలో నటించేందుకు ఓకే చెప్పినట్లుగా టాలీవుడ్ సర్కిల్స్‌లో టాక్ మొదలైంది. మరి, ఈ విషయమై చిత్రయూనిట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. నిజంగా శోభన ఇందులో నటిస్తే మాత్రం, ‘ఇరుముడి’పై మరింతగా అంచనాలు పెరగడం ఖాయం. చూద్దాం.. ఎప్పుడు అధికారిక ప్రకటన వస్తుందో? ఇక ఈ సినిమాలో రవితేజ సరసన ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే. బేబీ నక్షత్ర ఇందులో వారి పాపగా యాక్ట్ చేస్తోంది. సాయి కుమార్, అజయ్ ఘోష్, రమేష్ ఇందిర, స్వాసిక, మీసాల లక్ష్మణ్, రాజ్ కుమార్ కసిరెడ్డి, రమణ భార్గవ్, కిషోర్ కంచెరపాలెం, కార్తీక్ అడుసుమల్లి, మహేష్ వంటి వారంతా నటిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే 50 శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు. అయ్యప్ప స్వామి, అయ్యప్ప మాల నేపథ్యంలో సాగే ఈ కథలో.. ఓ అందమైన కుటుంబం, ఫ్యామిలీ ఎమోషన్స్ అద్భుతంగా ఉండబోతోన్నాయని మేకర్స్ చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి:
సింగర్ మంగ్లీ కేసులో ట్విస్ట్.. ఇదంతా బిగ్‌బాస్ కోసమేనా?
లెజెండరీ సింగర్ ఆశా భోంస్లే మృతి.. ప్రముఖుల నివాళులు
ఎం.ఎస్. రాజు రూటు మార్చారు.. ఈసారి నో ఫీలింగ్స్!
Chiranjeevi: చిరంజీవికి తప్పని వెయిటింగ్.. ఈ అడ్డంకులేంటి?
Venu Udugula: మంగ్లీ ఘటనతో నాకు ఎలాంటి సంబంధం లేదు
UBS OTT: ఉస్తాద్ ఓటీటీలోకి వచ్చేస్తున్నాడు.. స్ట్రీమింగ్ వివరాలివే!