Shiva Nirvana: క్లైమాక్స్ బాగుండి ఫెయిలైన సినిమా చరిత్రలో లేదు

ABN , First Publish Date - 2023-09-01T19:37:20+05:30 IST

విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన ‘ఖుషి’ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చి పాజిటివ్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ సినిమాను శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై వై రవి శంకర్, నవీన్ యెర్నేని నిర్మించారు. సినిమాకు మంచి స్పందన రావడంతో మేకర్స్ సక్సెస్ మీట్ నిర్వహించి.. ప్రేక్షకులకీ, మీడియాకు థ్యాంక్స్ చెప్పారు.

Shiva Nirvana: క్లైమాక్స్ బాగుండి ఫెయిలైన సినిమా చరిత్రలో లేదు
Kushi Movie Team

విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), సమంత (Samantha) జంటగా నటించిన ‘ఖుషి’ (Kushi) సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చి పాజిటివ్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ సినిమాను శివ నిర్వాణ (Shiva Nirvana) దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) బ్యానర్‌పై వై రవి శంకర్, నవీన్ యెర్నేని నిర్మించారు. లవ్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ప్రేమను పొందుతున్న ఈ చిత్ర సక్సెస్‌ను పురస్కరించుకని మేకర్స్ చిత్ర నిర్మాణ సంస్థ ఆఫీస్‌లో మీడియా సమావేశం నిర్వహించారు నిర్వహించారు. (Kushi Movie Media Meet)


ఈ కార్యక్రమంలో దర్శకుడు శివ నిర్వాణ మాట్లాడుతూ.. ఖుషి సినిమాకు ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. సినిమా బాగుందంటూ మీడియా పర్సన్స్ నుంచి అప్రిషియేషన్స్ వస్తున్నాయి. సినిమాను మీడియా కరెక్ట్‌గా జడ్జ్ చేస్తుందని నమ్ముతాను. అలాంటి మీడియా నుంచి పాజిటివ్ రిపోర్ట్ రావడం ఆనందంగా ఉంది. దేవుడు, నమ్మకాలు, కర్మ సిద్ధాంతం అనేది మన దేశంలో వందల ఏళ్ల క్రితం నుంచి ఉంది. ఈ నేపథ్యంతో బ్యూటిఫుల్ లవ్ స్టోరీని ఇప్పుడున్న సొసైటీకి చెప్పాలనుకుని రెండేళ్ల కిందట ఖుషి కథ రాసుకున్నాను. ఆ పాయింట్‌కు ప్రేక్షకులు కనెక్ట్ అవుతున్నారు. ఉదయం షో యూత్ తో మొదలై మ్యాట్నీ కపుల్స్ వెళ్తున్నారు. ఫస్ట్ షో కు ఫ్యామిలీస్ వస్తున్నారు. ఇలా మరికొన్ని వారాల పాటు మా ఖుషి థియేటర్స్‌లో ఫ్యామిలీస్‌తో కళకళలాడాలని కోరుకుంటున్నా. ఫన్ అండ్ ఎమోషన్‌ను విజయ్ తన నటనలో అద్భుతంగా చూపించాడు. అలాగే సమంత నటనకు ప్రేక్షకులు కనెక్ట్ అవుతున్నారు. ఫస్టాఫ్ ఫన్, లవ్ తో బాగుందని, అలాగే సెకండాఫ్‌లో ఫ్యామిలీ ఎలిమెంట్స్, ఎమోషన్ నచ్చాయని అంటున్నారు. చివరిలో క్లైమాక్స్‌ను బాగా హ్యాండిల్ చేశానని చెబుతున్నారు. ఒక క్లిష్టమైన పాయింట్‌ను చాలా సరళంగా అందరికీ రీచ్ అయ్యేలా చూపించామంటూ ప్రశంసలు వస్తున్నాయి. చాలా సంతోషంగా ఉంది. (Shiva Nirvana About Kushi Success)

Shiva.jpg

దర్శకుడిగా నేను ప్రేక్షకుల మనసుల్లో మరో మెట్టు పైకి ఎదిగానని అనుకుంటున్నాను. ప్రతి మధ్య తరగతి కుటుంబంలో ఒక హీరో ఉంటాడు. ఇందులో స్టార్‌గా తన ఇమేజ్ కాకుండా విప్లవ్ క్యారెక్టర్‌ను అర్థం చేసుకుని విజయ్ నేచురల్‌గా నటించాడు. ఏదైనా మనం మనిషిగా మన శక్తితో సాధించాలని అనుకుంటాడు. ఇలాంటి కొత్త పాయింట్ ఉంది కాబట్టే నేను లవ్ స్టోరీ చేశాను. లాస్ట్ అరగంట ప్రేక్షకుల్ని ఒక ఎమోషనల్ మూడ్ లోకి తీసుకెళ్లాలని ముందే అనుకున్నాము. అది బాగా వర్కవుట్ అయి ప్రేక్షకులకు రీచ్ ‌అవడం సంతోషంగా ఉంది. సిద్ధాంతాలు, శాస్త్రాలు వేరువేరుగా ఉండవచ్చు కానీ ఎవరు ఏది నమ్మినా నమ్మకున్నా ప్రేమించే మనుషులతో కలిసి ఉండాలని ఈ సినిమాలో చెప్పాము. క్లైమాక్స్ ముందు వరకు క్యారెక్టర్స్‌ను సస్టెయిన్ చేయకపోతే ముగింపు అంత బాగా రిసీవ్ చేసుకునేవారు కాదు. అంత సేపు ఎమోషన్ క్లైమాక్స్ చూశారంటే మీరు అక్కడే సినిమాతో కనెక్ట్ అయినట్లుగా భావిస్తాను. క్లైమాక్స్ బాగుండి ఫెయిలైన సినిమా చరిత్రలో లేదు. ఖుషి చూసి బయటకు వచ్చేప్పుడు ఒక మంచి సినిమా చూసిన ఫీల్‌తోనే వస్తారు. మ్యూజిక్ డైరెక్టర్ హేషమ్‌కు స్పెషల్ థాంక్స్. థియేటర్‌లో పాటలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మా ప్రొడ్యూసర్స్, మిగతా టీమ్ అందరికీ అభినందనలు తెలియజేస్తున్నానని అన్నారు.


ఇవి కూడా చదవండి:

============================

*Pawan Kalyan: సురేందర్ రెడ్డి కాంబినేషన్‌లో మూవీ.. ఆఫీస్ ప్రారంభమైంది

***********************************

*Tiger Nageswara Rao: వేటయింది.. ఇప్పుడు ఆట టైమ్!

***********************************

*Khushi film review: విజయ్ దేవరకొండ, సమంతల జోడీ బాగుంది

***********************************

*Nandamuri Mokshagna: బాలయ్య వారసుడు ఎట్టున్నడో చూశారా.. పిక్ వైరల్!

**********************************

Updated Date - 2023-09-01T19:37:20+05:30 IST