ఎం.ఎస్. రాజు రూటు మార్చారు.. ఈసారి నో ఫీలింగ్స్!

ABN , Publish Date - Apr 12 , 2026 | 04:17 PM

ఎం.ఎస్. రాజు.. ఈ పేరు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. టాలీవుడ్‌లో ‘శత్రువు, దేవి, మనసంతా నువ్వే, వర్షం, ఒక్కడు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను అందించిన సీనియర్ ఫిల్మ్ మేకర్ ఎం.ఎస్. రాజు. కొన్నాళ్లుగా సైలెంట్‌గా ఉన్న ఆయన, ఇప్పుడో సరికొత్త ప్రయోగానికి సిద్ధమయ్యారు.

MS Raju

ఎం.ఎస్. రాజు (MS Raju).. ఈ పేరు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. టాలీవుడ్‌లో ‘శత్రువు, దేవి, మనసంతా నువ్వే, వర్షం, ఒక్కడు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను అందించిన సీనియర్ ఫిల్మ్ మేకర్ ఎం.ఎస్. రాజు. కొన్నాళ్లుగా సైలెంట్‌గా ఉన్న ఆయన, ఇప్పుడో సరికొత్త ప్రయోగానికి సిద్ధమయ్యారు. విభిన్నమైన కథలను ఎంచుకోవడంలో తనదైన ముద్ర వేసే రాజు.. ‘డర్టీ హరి’ (Dirty Hari) వంటి చిత్రాలతో బోల్డ్ అటెంప్ట్స్ కూడా చేశారు. ఇప్పుడాయన మొదటిసారిగా హారర్ జోనర్‌లోకి అడుగుపెడుతున్నారు. ఆయన చేయబోయే తదుపరి సినిమాకు (MS Raju Next Film) సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


ఇందులో ఎం.ఎస్. రాజు ఆఫీస్‌ని దోచేయాలని ఇద్దరు వ్యక్తులు ప్రయత్నిస్తూ, లోపలికి వెళ్లగానే ఆయన నిర్మించిన, దర్శకత్వం వహించిన చిత్రాల పోస్టర్స్‌ చూసి.. వాటికి ఫిదా అవుతున్నారు. ఒక్కసారి ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్లి, ఆ సినిమాలోని సీన్లకు కనెక్ట్ అవుతున్నారు. అలా ఎం.ఎస్. రాజు తన తదుపరి సినిమా అనౌన్స్‌మెంట్‌ని వినూత్నంగా ప్లాన్ చేశారు. ఈ వీడియో నెట్టింట ఆసక్తిని రేకెత్తిస్తోంది. ‘మిమ్మల్ని ఫీల్ అయ్యేలా చేసిన వ్యక్తి.. ఇప్పుడు భయపెట్టబోతున్నాడు’ అనే క్యాప్షన్ సినిమా ఏ రేంజ్‌లో ఉండబోతుందో తెలియజేస్తోంది. ఇది ఒక ఇంటెన్స్ అండ్ గ్రిప్పింగ్ హారర్ థ్రిల్లర్ అని తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను 15 ఏప్రిల్, 2026న అధికారికంగా వెల్లడించనున్నారు. టాలీవుడ్‌లో హారర్ చిత్రాల శైలిని మార్చే విధంగా ఎం.ఎస్. రాజు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.


‘అవును, మా ఆఫీసులో దొంగలు పడ్డారు.. భయపడ్డారు.. మీరు కూడా ఖచ్చితంగా భయపడతారు..’ అంటూ ఆయన షేర్ చేసిన వీడియో బాగా వైరల్ అవుతోంది. ఒకప్పుడు నిర్మాతగా బ్లాక్‌బస్టర్ చిత్రాలను నిర్మించిన ఎం.ఎస్. రాజు.. ఈ మధ్య కాలంలో దర్శకుడిగా తన ప్రతిభను కనబరుస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన అన్ని జానర్స్ టచ్ చేస్తూ సినిమాలు చేస్తుండటం విశేషం. ఇప్పుడు హారర్ జానర్‌లోకి అడుగుపెడుతున్న రాజు, ఎలాంటి సక్సెస్‌ని అందుకుంటారో తెలియాలంటే మాత్రం, ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

ఇవి కూడా చదవండి:

Chiranjeevi: చిరంజీవికి తప్పని వెయిటింగ్.. ఈ అడ్డంకులేంటి?

Venu Udugula: మంగ్లీ ఘటనతో నాకు ఎలాంటి సంబంధం లేదు

UBS OTT: ఉస్తాద్ ఓటీటీలోకి వచ్చేస్తున్నాడు.. స్ట్రీమింగ్ వివరాలివే!

Jailer 2: షారుఖ్ ప్లేస్‌లో పవన్ కళ్యాణ్.. బాబోయ్, ఈ వార్త నిజమైతేనా?

దయచేసి రూ.16 కోట్లు సాయం చేయండి: నందమూరి బాలకృష్ణ

Updated Date - Apr 12 , 2026 | 04:21 PM