Ravi Teja: 'ఇరుముడి'తో.. వస్తున్న రవితేజ! ఫస్ట్ లుక్ అదిరింది
ABN , Publish Date - Jan 26 , 2026 | 10:25 AM
రవితేజ పుట్టిన రోజు సందర్భంగా.. మైత్రీ మూవీ మేకర్స్ మాస్ మహారాజా ఫ్యాన్స్‌కు అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు.
ఇటీవల భర్త మాశయిలకు విజ్ఞప్తి (Bhartha Mahasayulaku Wignyapthi) అంటూ మంచి విషయాన్ని తన ఖాతాలో వేసుకున్న మాస్ మాహరాజా రవితేజ (Ravi Teja) తన తదుపరి ప్రాజెక్టును రివిలీ చేశాడు. మజిలీ, నిన్ను కొరి వంటి బ్లాక్‌బస్టర్ హిట్ చిత్రాల దర్శకుడు శివ నిర్వాణ (Shiva Nirvana) డైరెక్షన్‌లో చేస్తున్న సినిమా నుంచి అప్డేట్ వచ్చింది. మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) ఈ మూవీని నిర్మిస్తోంది. అయితే.. రవితేజ జన్మదినాన్ని పురస్కరించుకుని సోమవారం ఈ చిత్రం ఫస్ట్ లుక్ రివీల్ చేశారు.
రవితేజ 77 (RT 77) వ సినిమాగా వస్తున్న ఈ చిత్రానికి ఎవరు ఊహించని విధంగా ఇరుముడి (Irumudi) అనే టైటిల్ ఫిక్స్ చేసి ఫ్యాన్స్‌కు, సినీ లవర్స్‌కు గట్టి షాక్ ఇచ్చారు. టైటిల్ గురించి తెలుసుకున్న వారంతా షాక్ అవుతున్నారు. చాలా రోజుల తర్వాత రవితేజ నుంచి కంటెంట్ బేస్డ్ సినిమా వస్తోందని ఎగిరి గంతేస్తున్నారు.
కాగా ఈ సినిమాలో ప్రియా భవాని శంకర్ (Priya BhavaniShankar) కథానాయికగా నటిస్తోండగా సాయి కుమార్ (SaiKumar), బేబీ నక్షత్ర (BabyNakshathra) కీలక పాత్రలు చేస్తున్నారు. జీవీ ప్రకాశ్ కుమార్ (G.V.Prakash Kumar) సంగీతం అందిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం వేసవిలో ప్రేక్షకుల ఎదుటకు వచ్చే అవకాశం ఉంది.